తమ అభిమాన హీరోలను విపరీతంగా ఆరాధిస్తుంటారు ఫ్యాన్స్. సౌత్ లో ఈ ధోరణి మరీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తమిళనాడులో హీరోలను అక్కడివారు దేవుళ్లగా భావిస్తుంటారు.

విజయ్, అజిత్ లాంటి స్టార్ హీరోల కోసం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మాటల యుద్ధాలు జరుగుతుంటాయి. అలాంటి ఓ అభిమాని కారణంగా ఇటీవల అజిత్ 
ఎదుర్కొన్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల అజిత్ ఎయిర్ పోర్ట్ నుండి తన కారులో బయలుదేరాడు.

అది గమనించిన ఓ అభిమాని అజిత్ ని వెంబడిస్తూ 18 కిలోమీటర్ల వరకు వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన అజిత్ రోడ్డు మధ్యలోనే కారు ఆపి సదరు అభిమానిని పిలిచి మాట్లాడాడు. ముందు తానెవరో అజిత్ కి పరిచయం చేసుకున్న తరువాత.. గతంలో మూడు సార్లు మిమ్మల్ని కలిసానని కానీ ఫోటో తీసుకోవడం కుదరలేదని అందుకే ఫాలో అవుతూ వచ్చానని వెల్లడించాడు.

అది విన్న అజిత్ ఇంకెప్పుడూ ఇలా ప్రవర్తించవద్దని చెప్పి సదరు అభిమాని కోరిక ప్రకారం ఫోటో దిగి పంపించాడట. తాను ఆ విధంగా ప్రవర్తించినా అజిత్ మాత్రం కోప్పడలేదని, మీకేమైనా అయితే నాకే బాధ అంటూ చెప్పారని సదరు అభిమాని వెల్లడించారు.