Asianet News TeluguAsianet News Telugu

ఇద్దరికీ 22 ఏళ్ళు ఏజ్ గ్యాప్..బోల్డ్ హీరోయిన్ తో అజిత్ బావమరిది ప్రేమాయణం, ముద్దులతో కంఫర్మ్ చేశారుగా

రిచర్డ్ రిషి తెలుగు తమిళ భాషల్లో అనేక చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. ఇప్పటికీ నటిస్తున్నారు.

Ajith brther in law love affair with this bold heroine dtr
Author
First Published Jun 2, 2023, 4:01 PM IST

స్టార్ హీరో తలా అజిత్ సతీమణి షాలిని అనే సంగతి తెలిసిందే. ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక చిత్రాల్లో నటించారు. అజిత్ ని వివాహం చేసుకుని స్థిరపడ్డారు. ఆమె సోదరుడు రిచర్డ్ రిషి తెలుగు ప్రేక్షకులకు సుపరిచయమే. రిచర్డ్ రిషి తెలుగు తమిళ భాషల్లో అనేక చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. ఇప్పటికీ నటిస్తున్నారు. ఎందుకంటే ప్రేమంట చిత్రంలో రిచర్డ్ రిషి విలన్ గా నటించారు. 

ప్రస్తుతం రిచర్డ్ రిషి వయసు 45 ఏళ్ళు. గతంలో రిచర్డ్ రిషి వివాహం గురించి అనేక పుకార్లు వినిపించాయి. కానీ అవేమీ నిజం కాలేదు. అయితే తాజాగా రిచర్డ్ రిషి తన లవ్ లైఫ్ ని సోషల్ మీడియా వేదికగా కంఫర్మ్ చేశారు. 23 ఎల్లా యంగ్ అండ్ బోల్డ్ బ్యూటీ యషికా ఆనంద్ తో ఈ సీనియర్ నటుడు ఘాటు ప్రేమలో మునిగితేలుతున్నాడు. 

యషిక, రిచర్డ్ ఇద్దరూ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ముద్దుల్లో మునిగితేలుతున్న ఫొటోస్ ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీనితో వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ రివీల్ అయింది. యషిక ఆనంద్ రిచర్డ్ కి ఘాటు ముద్దుతో తన ప్రేమ తెలుపుతోంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

యషిక నిత్యం సోషల్ మీడియాలో ఘాటైన ఫోటో షూట్స్ చేస్తూ హంగామా చేయడం చూస్తూనే ఉన్నాం. వీరిద్దరికి ఎలా పరిచయం అయింది ఎలా ప్రేమలో పడ్డారు అనే విషయాలు తమిళనాట ఆసక్తికరంగా మారాయి. అయితే వీళ్లిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ గురించి కూడా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. యషిక కంటే రిచర్డ్ వయసులో 22 ఏళ్ళు పెద్దవాడు. గతంలో హీరోయిన్ సాయేషా కూడా తనకంటే దాదాపు 18 ఏళ్ళు పెద్దవాడైన ఆర్యని పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios