‘తునివు’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై అజిత్ ఫ్యాన్స్‌తో పాటు తమిళ ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

అజిత్ హీరోగా ‘తెగింపు’ ఈ సంక్రాంతికి వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్యాంక్ దోపిడీ చుట్టూ తిరిగే కథనే. తమిళంలో ‘తునివ్’గా, తెలుగులో ‘తెగింపు’గా వస్తోన్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్ చూస్తే సినిమా మొత్తం బ్యాంక్ ని దోచేసే కథ అని అర్థమవుతోంది.తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇందులో విలన్ షేడ్స్ ఉన్న హీరోగా నటిస్తున్నారు. పూర్తి స్దాయి యాక్షన్ డ్రామాగా రూపొందే ఈ సినిమా ట్రైలర్ లో మలయాళ నటి మంజు వారియర్ కొత్తగా కనిపిస్తున్నారు. 44 ఏళ్ళ మంజు వారియర్ పూర్తిగా యాక్షన్ రోల్ లో కనిపించడం విశేషం. ఈ ట్రైలర్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఈ ట్రైలర్ లో బ్యాంక్‌లో దోపీడి చేసే వ్యక్తిగా అజిత్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. దర్శకుడు వినోద్ మరోసారి తనదైన యాక్షన్ డోస్‌ను ఈ సినిమాతో ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేసాడు. ఇక అజిత్‌తో పాటు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న మంజు వారియర్ కూడా ఈ మూవీలో యాక్షన్ చేస్తూ, డేరింగ్ స్టంట్స్ చేసి షాక్ ఇచ్చింది. అయితే అజిత్ ఈ సినిమాలో బ్యాంకును ఎందుకు లూటీ చేస్తున్నాడనేది సినిమా కథను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లనుందని చిత్ర యూనిట్ చెప్తోంది. ఇక ఆ విషయం ప్రక్కన పెడితే ఈ సినిమా ట్రైలర్ చూడగానే ...ఇది 2022 సంవత్సరంలో వచ్చిన విజయ్ చిత్రం బీస్ట్ ని గుర్తు చేస్తోందని అన్నారు.

విజయ్ హీరోగా నటించిన బీస్ట్ ఈ వేసవిలో (2022) విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ మూవీ ఒక హీస్ట్ థ్రిల్లర్. బ్యాంక్ దోపిడీ కథతో తెరకెక్కిన ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. విజయ్ స్టార్డం కూడా ఆ సినిమాని కాపాడలేకపోవటంతో ఇప్పుడు అజిత్ హీరోగా ‘తెగింపు’కూడా బ్యాంక్ దోపిడీ జానర్ లో వస్తున్న సినిమా కావటంతో ఈ సినిమా విజయం పై కొందరు అనుమానాలు వక్తం చేస్తున్నారు. అయితే అజిత్ అంత తెలివి తక్కువ వాడా..ఇలాంటి కథే తిరిగి ఎంచుకోవటానికి ,ఖచ్చితంగా ఈ సినిమాలో ఏదో కొత్త ఎలిమెంట్ ఉండే ఉంటుంది అని అంటున్నారు. 

‘తునివు’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై అజిత్ ఫ్యాన్స్‌తో పాటు తమిళ ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకోవడంతో, ఈ సినిమాతో వీరిద్దరు హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ఈ సినిమాలో సముథ్రకని మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి గిబ్రాన్ సంగీతం అందిస్తుండగా, తెలుగులో ఈ సినిమాను ‘తెగింపు’ అనే టైటిల్‌తో రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్. మరో స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘వారిసు’ సినిమాతో పోటీకి దిగుతున్న అజిత్ ‘తునివు’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.