Asianet News TeluguAsianet News Telugu

ఫ్రీగా యంగ్‌ హీరో సినిమా.. ఏ ఓటీటీలో?.. ఎప్పట్నుంచి?

ఇప్పుడు ఓటీటీలకు మంచి డిమాండ్‌ ఉంది. ఈ క్రమంలో చిన్న సినిమాలకు కూడాఓటీటీ పెద్ద సపోర్ట్ అవుతుంది. అయితే ఓ యంగ్‌ హీరో మూవీ ఏకంగా ఫ్రీగా స్ట్రీమింగ్‌ కావడం విశేషం. 

ajay gadu movie streaming in populer ott with free details arj
Author
First Published Jan 17, 2024, 11:48 PM IST

ఇటీవల చాలా సినిమాలో థియేటర్లో వస్తున్నాయి. కొన్ని మాత్రమే ప్రత్యేకంగా ఓటీటీలో వస్తున్నాయి. ఈనేపథ్యంలో యంగ్‌ హీరో అజయ్‌ కర్తుర్వర్‌ నటించిన `అజయ్‌ గాడు` మూవీ ఇప్పుడు ఓటీటీలో రచ్చ చేస్తుంది. ఇదిప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. కారణం ఈ మూవీ ఫ్రీగా స్ట్రీమింగ్‌ కావడమే. ఈ చిత్రం జీ5లో ఉచితంగా స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ అకౌంట్‌ ఉన్న వాళ్లు ప్రీగా సినిమాని చూసేయోచ్చు. దీంతో ఇప్పుడు ఈ మూవీకి మంచి స్పందన లభిస్తుంది. అదిరిపోయే వ్యూస్‌ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమ్‌సంతోషం వ్యక్తం చేసింది. మూవీ డిటెయిల్స్ పంచుకుంది. 

`అజయ్‌గాడు`  సినిమాను స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించారు అజ‌య్ క‌ర్తుర్వ‌ర్‌. అజ‌య్ కుమార్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రూపొందించారు. చంద‌న కొప్పిశెట్టి సంయుక్తంగా నిర్మించారు. అజయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘అజయ్‌గాడు’ మూవీలో బిగ్ బాస్ తెలుగు ఫేమ్ భానుశ్రీ, రోడీస్ విన్న‌ర్ శ్వేత మెహ‌తా కీలక పాత్రల్లో నటించారు. ప్రాచీ ట‌క్క‌ర్‌, అభ‌య్ బేతిగంటి, జ‌య‌శ్రీగారు, య‌ద్దం రాజు తదితరలు ఇతర పాత్ర‌ల్లో న‌టించి మెప్పించారు.

`అజ‌య్ గాడు` సినిమా అజ‌య్ అనే వ్య‌క్తికి సంబంధించిన క‌థ‌. మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన వ్య‌క్తి అజ‌య్‌. రోజురోజుకీ మారిపోతున్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవ‌డానికి, డ‌బ్బు, పేరు, ప్రేమ వంటి వాటిని తెలుసుకోవ‌డానికి ఇబ్బందిప‌డుతుంటాడు. వీట‌న్నిటినీ వ‌దిలేయాల‌నుకున్న అత‌ను ఒకానొక సంద‌ర్భంలో శ్వేత‌ను స్ఫూర్తిగా ప్రేమిస్తాడు. ఆమె డ్ర‌గ్స్‌కి బానిస అయిన మెడికో. అలాంటి ఆమెను సక్రమ మార్గంలో ఉంచటానికి చేసే ప్రయత్నాల్లో బాహ్య ప్ర‌పంచంతో అజ‌య్ ఎలాంటి యుద్ధం సాగించాడ‌నేదే క‌థ‌. ఈ సినిమా జ‌న‌వ‌రి 12 నుంచి జీ5లో ఉచితంగా అందుబాటులో ఉంది.

ఈ సందర్భంగా అజ‌య్ క‌ర్తుర్వ‌ర్ మాట్లాడుతూ, ఒక సినిమాలో న‌టిస్తూ, నిర్మాత‌గా,  ద‌ర్శ‌కుడిగా ప‌నిచేయ‌డం మామూలు విష‌యం కాదు. చాలా థ్రిల్లింగ్ జ‌ర్నీ ఇది. ఈ ప్రాజెక్టుకు నా మ‌న‌సులో ఎప్పుడూ ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంటుంది. ఈ అద్భుత‌మైన అనుభ‌వాన్ని ప్ర‌తి ఒక్క‌రితోనూ పంచుకోవాల‌ని అనుకుంటున్నాను. సినిమా క‌థ ఎలా ఉంటుందో ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. కానీ సినిమాలో అంత‌కు  మించిన విష‌యాలు చాలా ఉంటాయి. స్టంట్స్, ఎమోష‌న్స్, రొమాన్స్ వీట‌న్నిటిని క‌ల‌గ‌లిపి అద్భుతంగా తెర‌కెక్కించాం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులకు ఈ సినిమాను అందించ‌డ‌మే నా ధ్యేయం. జీ5తో క‌లిసి ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి చాలా ఆనందంగా ఉంది.`అజ‌య్‌గాడు` సకుటుంబంగా చూడాల్సిన సినిమా` అని చెప్పాడు.

భానుశ్రీ మాట్లాడుతూ, `అజ‌య్ క‌ర్తుర్వ‌ర్‌తో ప‌నిచేయ‌డం అత్య‌ద్భుత‌మైన అనుభవం. తను మంచి కోస్టార్. ఈ సినిమాలో ఆయన పాత్ర, కథనం డిఫరెంట్‌గా ఉంటుంది. అజయ్ తనదైన నటనతో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తారనటంలో సందేహహం లేదు. ఆయ‌న క‌థ చెప్ప‌గానే నాకు న‌చ్చింది. ఈ సినిమాలో నేను ప్రియ అనే పాత్ర‌లో న‌టిస్తున్నాను. స్వేచ్ఛ‌గా ఉండే యువ‌తి పాత్ర అది. త‌న జీవితానికి త‌న‌కు న‌చ్చిన సిద్ధాంతాన్ని అమ‌లు చేసుకునే అమ్మాయి పాత్ర అది. బోల్డ్ రిలేష‌న్‌షిప్స్ ని చూపిస్తూ సాగే, అంద‌మైన ప్రేమ క‌థ ఇది` అని పేర్కొంది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios