క్రితం సంవత్సరం వచ్చిన స్లీపర్ హిట్‌ తెలుగు సినిమా  ‘బ్రోచేవారెవరురా’ .  శ్రీ విష్ణు, నివేదా థామస్, సత్యదేవ్, నివేదా పేతురాజ్‌ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫన్ తో జనాలకు బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించారు.  క్రైమ్‌ కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా  వినోదం పంచింది. లైంగిక వేధింపులు అనే సున్నితమైన సబ్జెక్ట్‌ను ఈ చిత్రంలో అతి సున్నితంగా చర్చించారు వివేక్‌. 

 ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్‌ కాబోతోంది. అజయ్‌ దేవగణ్‌ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. అభయ్‌ డియోల్, కరణ్‌ డియోల్‌ ఈ రీమేక్‌లో హీరోలు. దేవెన్‌ ముంజల్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్‌ బాగా నచ్చడంతో రీమేక్‌ రైట్స్‌ తీసుకున్నారు అజయ్‌. ప్రస్తుతం బాలీవుడ్ ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్టుగా సినిమాలో కొన్ని మార్పులు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం జెర్సీ, మిధునం, చత్రపతి సినిమాలు ప్రస్తుతం అక్కడ రీమేక్ అవుతున్నాయి. ఈ లిస్ట్ లోకి ఈ  సినిమా కూడా చేరిపోయింది.

ప్రస్తుతం అజయ్ దేవగన్ ..హైదరాబాద్‌లోనే షూటింగ్ జరుగుతున్న మే డే చిత్రంతో  బిజీగా ఉన్నారు.  ఆ తర్వాత ది బిగ్ బుల్, త్రిభంగ చిత్రాలను కూడా నిర్మించనున్నాడు. ఇవేకాకుండా ఆర్ఆర్ఆర్ మూవీతో  తొలిసారిగా ఓ డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్న అజయ్ దేవ్‌గన్ చేతిలో సూర్యవంశి, మైదాన్ చిత్రాలు కూడా ఉన్నాయి.