మొదటి రోజు 16 నుంచి 18 కోట్లు కలెక్షన్స్ ఎక్సపెక్ట్ చేస్తే అది కేవలం 10 నుంచి 11 మధ్యే ఆగిపోయింది. 3D,  4DX వెర్షన్స్ రేట్లు పెంచటం వల్లనేమో.. 

 తన స్వీయ దర్శకత్వంలో సౌత్ సూపర్ హిట్ మూవీ ‘ఖైదీ’ని రీమేక్ చేసాడు అజయ్ దేవగన్. భోళా (Bholaa) అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసారు. శ్రీరామ నవమి సందర్బంగా మార్చి 30న ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. అయితే సినిమా అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదనే చెప్పాలి. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ బాగా తక్కువగా ఉన్నాయి. ఓపినింగ్స్ చాలా చోట్ల సరిగ్గా లేవు. బాలీవుడ్ ట్రేడ్ ఈ సినిమాపై బాగా ఆశలు పెట్టుకుంది. మాస్ ప్రెండ్లీ మూవీ కాబట్టి బాగా వర్కవుట్ అవుతుందని అంచనా వేసింది. దానికి తోడు శ్రీరామ నవమి పండగ రోజు కూడా కలిసి వస్తుందని అనుకున్నారు.

మాస్ ఏరియాల్లో ఈ సినిమా బాగానే ఓపినింగ్స్ వచ్చాయి కానీ ముంబై, డిల్లీ , సౌత్ లో చాలా చోట్ల వీక్ గా ఉంది. మొదటి రోజు 16 నుంచి 18 కోట్లు కలెక్షన్స్ ఎక్సపెక్ట్ చేస్తే అది కేవలం 10 నుంచి 11 మధ్యే ఆగిపోయింది. 3D, 4DX వెర్షన్స్ రేట్లు పెంచటం వల్లనేమో అసలు రెస్పాన్స్ లేదు. సౌత్ సూపర్ హిట్ ఖైదీకి రీమేక్‌గా తెరకెక్కిన భోళా మీద సౌత్ సర్కిల్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. తన ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒరిజినల్‌ కథలో మార్పులు చేసి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించారు అజయ్‌

గత రెండు మూడేళ్లలో నార్త్ ఇండస్ట్రీలో వేళ్ల మీద లెక్కబెట్టగలిగే అన్ని సినిమాలు కూడా సక్సెస్‌ కాలేదు. దీంతో హిట్ కోసం హీరోలు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఒకరిద్దరు హీరోలు బిగ్ హిట్స్‌తో సత్తా చాటితే మిగతా స్టార్స్‌ హిట్‌ ట్రాక్‌లోకి వచ్చేందుకు కష్టపడుతున్నారు. అలా ఇప్పుడు అజయ్ దేవగన్‌ టర్న్ వచ్చింది. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా విషయంలో కాస్త సీరియస్‌గా ప్రమోషన్స్ చేసారు. భోళా సినిమాకు దర్శకుడు కూడా తానే కావటంతో మరింత కేర్ తీసుకున్నారు అజయ్‌. వరుస ప్రెస్‌మీట్‌లతో హడావిడి చేయటంతో పాటు వింటేజ్‌ బాలీవుడ్ సినిమాను గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పోస్టర్స్‌ను 70స్‌, 80స్‌ స్టైల్‌లో డిజైన్ చేయించారు అజయ్‌. అయితే అవన్నీ బూడిదలో పోసిన పన్నీరు గా మారింది..

ఇలా ఉంటే, ఈ హీరో నటించిన మరో చిత్రం ‘మైదాన్’ (Maidaan). బయోపిక్ స్టోరీతో వస్తున్న ఈ చిత్రం రెండేళ్ల క్రిందటే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా వాళ్ళ పోస్ట్‌పోన్ అవ్వడం, ఆ తరువాత విడుదల చేయడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదురుకుంది. ఇక ఎట్టకేలకు ఈ ఏడాది జూన్ 23న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.