మహారాష్ట్రలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ... ఎక్కడ, ఎప్పుడో తెలుసా?  

అజంతా-ఎల్లోరా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ 10వ ఎడిషన్ లో ఇండియన్ సినిమాలే కాదు అంతర్జాతీయ సినిమాలను కూడా ప్రదర్శించనున్నారు. ఇలా 65 సినిమాలను ప్రదర్శనకు సిద్దం చేసారు.   

Ajanta Ellora international film festival 10 edition in Maharashtra AKP

Maharashtra : మహారాష్ట్రలో ఈ నెల (జనవరి 2024) 15 నుండి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ఈ అజంతా-ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (AIFF) లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన 65 చిత్రాలను ప్రదర్శించనున్నారు.  

ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు చత్రపతి శంభాజినగర్ వేదిక కానుంది.  మరఠ్వాడా ఆర్ట్, కల్చర్ ఆండ్ ఫిల్మ్ ఫౌండేషన్, నాథ్ గ్రూప్, మహాత్మ గాంధీ మిషన్ (MGM), యశ్వంత్ రావ్ చవాన్ సెంటర్ సంయుక్తంగా ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తోంది. ఇందులో పలువులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి నటులు పాల్గొంటారని నిర్వహకులు చెబుతున్నారు.

లగాన్, స్వదేశ్, జోధా అక్బర్, పానిపట్ వంటి ఆస్కార్-నామినేట్ సినిమాలను నిర్మించిన బాలీవుడ్ ప్రొడ్యూసర్ అశుతోష్ గోవారికర్ ఈ 10వ ఎడిషన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గౌరవ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. జనవరి 15 నుండి 19 2025 వరకు ఛత్రపతి శంభాజీనగర్‌లో ఈ అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ను నిర్వహంచబోతున్నారు. 

ఈ సందర్భంగా ఏఐఎఫ్ఎప్ డైరెక్టర్ సునీల్ సుక్తాంకర్ మాట్లాడుతూ... అంతర్జాతీయ స్థాయిలో మహారాష్ట్రను ప్రొడక్షన్ హబ్ గా తీర్చిదిద్దేందుకే ఏఐఎఫ్ఎప్ శంభాజీనగర్ లో ఏర్పాటు చేసామన్నారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ వరల్డ్ క్లాస్ సినిమాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. 

ఈ ఏఐఎఫ్ఎఫ్ ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్ నందకిషోర్ కంగ్లివాల్ మాట్లాడుతూ... గతంలో నిర్వహించిన 9 ఎడిషన్స్ కు అభిమానుల నుండి విశేష స్పందన వచ్చిందని తెలిపారు. అందువల్లే ఇప్పుడు నిర్వహించే 10వ ఎడిషన్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.  

ఈ అజంతా ఎల్లోరా ఫిల్మ్ ఫెస్టివల్ లో జాతీయ అంతర్జాతీయ సినిమాలతో పాటు మరాఠి సినిమాలను ప్రదర్శించనున్నారు. తద్వారా ఈ సినిమాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతాయి. 

ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రానికి గోల్డెన్ కైలాష్ అవార్డ్ తో పాటు లక్ష రూపాయల నగదు బహుమతి అందిస్తారు. బెస్ట్ యాక్టర్స్,  బెస్ట్ స్క్రీన్ ప్లే వంటి కేటగిరీల్లో కూడా అవార్డులు అందిస్తారు. మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఆశిష్ శెల్కర్ ఈ అజంతా ఎల్లోరా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ను ప్రారంభిస్తారు. 
 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios