నివేదా ఛాన్స్ ని ఐశ్వర్య దక్కించుకుందా?

ఏ కారణంగానైనా ఓ సినిమా వాయిదా పడ్డా అది మరో సినిమాపై ప్రభావం పడుతుంది. డేట్స్ అడస్ట్ కాదు. దీంతో తప్పని పరిస్థితుల్లో కొన్ని సార్లు సినిమాని వదిలేసుకోవాల్సి వస్తుంది. నివేదా పేతురాజ్‌ విషయంలో ఇప్పుడు అదే జరిగింది. 

aiswarya rajesh replace with nivetha pethuraj arj

సినిమాలో హీరోయిన్లు ఫైనల్‌ అయి సెట్‌లోకి వెళ్లేంత వరకు క్లారిటీ ఉండదు. ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చు. చివరి నిమిషంలో హీరోయిన్‌ని మార్చి మరొకరిని తీసుకునే అవకాశాలుంటాయి. ఇలాంటివి కామన్‌గా జరిగేవి. అందుకు కారణాలు చాలానే ఉంటాయని చెప్పొచ్చు. అదే సమయంలో డేట్స్ ఇష్యూ కూడా హీరోయిన్లని ఇబ్బంది పెట్టే అంశం.

ఒకేసారి హీరోయిన్లు రెండుమూడు సినిమాలు చేస్తుంటారు. హీరో బేస్డ్ చిత్రాలు కావడంతో హీరోయిన్లకి సినిమాల్లో తక్కువ నిడివి ఉంటుంది. తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీంతో తక్కువ రోజుల్లోనే వారి షూటింగ్‌ పార్ట్ పూర్తవుతుంది. అందుకే కథానాయికలు కూడా ఒకేసారి రెండు మూడు సినిమాలకు కమిట్‌ అవుతుంటారు. అయితే ఏ కారణంగానైనా ఓ సినిమా వాయిదా పడ్డా అది మరో సినిమాపై ప్రభావం పడుతుంది. డేట్స్ అడస్ట్ కాదు. దీంతో తప్పని పరిస్థితుల్లో కొన్ని సార్లు సినిమాని వదిలేసుకోవాల్సి వస్తుంది. 

నివేదా పేతురాజ్‌ విషయంలో ఇప్పుడు అదే జరిగింది. ఆమె సాయిధరమ్‌ తేజ్‌తో ఓ సినిమాకి కమిట్‌ అయ్యింది. దేవాకట్టా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందాల్చి ఉంది. కరోనా వల్ల షూటింగ్‌ ఆగిపోవడంతో ఇప్పుడు డేట్స్ ప్లాబ్లెమ్‌ వచ్చింది. ప్రస్తుతం ఆమె `పోన్‌ మనిక్కవెల్‌`, `రెడ్‌`, `పార్టీ`, `జాగజలా కిలాడి` చిత్రాల్లో నటిస్తుంది. ఇందులో `రెడ్‌` విడుదలకు సిద్ధంగా ఉంది. మిగిలిన సినిమాల షూటింగ్‌ల విషయంలో డేట్స్ ఇబ్బంది తలెత్తడంతో సాయిధరమ్‌ తేజ్‌ సినిమాని వదులుకుందట. దీంతో ఆమె స్థానంలో ఐశ్వర్యా  రాజేష్‌ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఐశ్వర్య కూడా అరడజన్‌ సినిమాలకు పైగా చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios