Asianet News TeluguAsianet News Telugu

వైరల్ వీడియో: ప్రపంచ సుందరి ఐశ్వర్య కూతురు ఆరాధ్య మెస్మరైజింగ్ డాన్స్!

ఐశ్వర్య రాయ్ కజిన్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో ఆరాధ్య డాన్స్ చేశారు. తల్లి ఐశ్వర్య, తండ్రి అభిషేక్ ని అనుసరిస్తూ ఆమె చేసిన డాన్స్ కి బంధువులు మెస్మరైజ్ అయ్యారు. ఇక కూతురి డాన్స్ చూసిన ఐశ్వర్య సైతం మురిసిపోవడంతో పాటు గుండెలకు హత్తుకొని, ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆరాధ్య డాన్స్ వీడియో వైరల్ అవుతుంది. 
 

aishwarya rai daughter  aradhya mesmerises with her dance skills ksr
Author
Hyderabad, First Published Feb 24, 2021, 10:55 AM IST


ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాధ్య తల్లికి తగ్గ తనయ అనిపించారు. అద్భుతమైన డాన్స్ తో ఆరాధ్య అందరి దృష్టిని ఆకర్షించారు. ఓ ప్రీ వెడ్డింగ్ వేడుకలో పేరెంట్స్ తో కలిసి ఆరాధ్య వేసిన స్టెప్స్ వైరల్ అవుతున్నాయి. అందానికి చిరునామాగా ఐశ్వర్యను చెప్పుకుంటారు. దాదాపు రెండు దశాబ్దాలు ఆమె కుర్రాళ్ళ కలల రాణిగా ఉన్నారు. ఇక హీరోయిన్ గా కూడా బాలీవుడ్ ని ఐశ్వర్య ఏలడం జరిగింది. స్టార్ హీరోలకు మించి ఫేమ్ ఆమె అనుభవించారు. 


లెజెండరీ నటుడు అమితాబ్ కొడుకు అభిషేక్ ని పెళ్లి చేసుకున్న ఐశ్వర్య, బచ్చన్ ఇంటి కోడలు అయ్యారు. ఐశ్వర్యను పెళ్లి చేసుకున్న అభిషేక్ ఆమె ద్వారా ఫేమ్ సంపాదించారంటే అతిశయోక్తి కాదు. ఐశ్వర్య లాంటి అందగత్తెకు అమ్మాయి పుట్టింది అనేది అప్పట్లో సంచలం రేపింది. ఐశ్వర్య కూతురు ఎలా ఉంటుందో చూడాలని జనాలు, చూపించాలని మీడియా తెగ ఆరాటపడింది. పసికందు ఆరాధ్య ఫోటోలు బయటికి రాకుండా కుటుంబం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. 


ఆరాధ్య పుట్టిన చాలా రోజుల తరువాత ఆమె ఫోటోలు బయటికి రావడం జరిగింది. ప్రస్తుతం ఆరాధ్య వయసు 9ఏళ్ళు. ఐశ్వర్య రాయ్ కజిన్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో ఆరాధ్య డాన్స్ చేశారు. తల్లి ఐశ్వర్య, తండ్రి అభిషేక్ ని అనుసరిస్తూ ఆమె చేసిన డాన్స్ కి బంధువులు మెస్మరైజ్ అయ్యారు. ఇక కూతురి డాన్స్ చూసిన ఐశ్వర్య సైతం మురిసిపోవడంతో పాటు గుండెలకు హత్తుకొని, ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆరాధ్య డాన్స్ వీడియో వైరల్ అవుతుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios