Asianet News TeluguAsianet News Telugu

భారతీయుల గురించి ఐశ్వర్య రాయ్ సూపర్ కామెంట్స్.. ఇంటర్నేషనల్ షోలో అదిరిపోయే రిప్లై.!

మాజీ విశ్వ సుందరి, బాలీవుడ్ హీరోయిన్ గ్లోబ్ వైడ్ గా క్రేజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఓ ఇంటర్నేషనల్ టాక్ షోలో ఐషు భారతీయుల గురించి చెప్పిన మాటలు అప్పట్లో సెన్సేషన్ గా మారాయి. 
 

Aishwarya Rai comments about Indians the old video Goes Viral  NSK
Author
First Published Nov 1, 2023, 1:36 PM IST

అందం, టాలెంట్ కలిస్తే ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ (Aishwarya Rai Bachchan) అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నవంబర్ 1న 1973లో జన్మిచ్చింది. 1994లో మిస్ వరల్డ్ కిరీటం సొంతం చేసుకుంది. ఆ తర్వాత అనే బిరుదులు అందుకుంది. పాశ్చాత్య దేశాలలో ఐశ్వర్య రాయ్ భారతీయ ఐకాన్ గా మారింది. ఈరోజు ఐశ్వర్య రాయ్ పుట్టిన రోజు కావడం విశేషం. నేటితో మాజీ విశ్వసుందరి 50వ ఏటా అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సెలబ్రెటీలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

ఐషు పుట్టిన రోజు సందర్భంగా ఇండియన్ గురించి ఇంటర్నేషనల్ టాక్ షో, ఇంటర్వ్యూల్లో ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అందుకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. ప్రముఖ అమెరికన్ హోస్ట్ ఓప్రా విన్‌ఫ్రే షోలో ఇండియన్ గురించి గొప్ప మాట్లాడి భారతీయుల గొప్పను వివరించే ప్రయత్నం చేసింది. 

ఐశ్వర్యరాయ్ తను మొదటిసారి విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యిందంట. ఆ సమయంలో తను మాట్లాడే ఇంగ్లీష్ కు వారు షాక్ అయ్యారంట. మీరు ఎక్కడ చదువుకున్నారంటూ ప్రశ్నించగా.. ఇండియాలోనే చదువుకున్నట్టు బదులిచ్చిందంట. కానీ వారు మాత్రం మీరు కచ్చితంగా విదేశాల్లోనే చదువుకుని ఉంటారు. ఇండియాలో చదివి ఇంత అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడటం ఆశ్చర్యమన్నారంట. ఇదే విషయాన్ని ఓప్రా విన్‌ఫ్రే షోలో చెప్పింది. మేము ఇంగ్లీష్ లో చదువుకోవద్దా? అంటూ ప్రశ్నించింది. అయినా అది మాకు చాలా సింపుల్ అని కూడా రిప్లై ఇచ్చింది. 

అలాగే భారతీయులు చాలా గౌరవప్రదరంగా ఉంటారని, అతిథి సత్కారం గొప్పగా ఉంటుందని అంతర్జాతీయ షోలో చెప్పడం అప్పట్లో ఆసక్తికరంగా మారింది. ఇక ఇండియా కీర్తిని ఐశ్వర్య తన టాలెంట్, అందంతో గ్లోబ్ వైడ్ గా వ్యాప్తి చేసింది. మిస్ వరల్డ్ టైటిల్ గెలిచిన నాలుగేళ్లకు 1997లో తమిళ చిత్రం ఇరువర్‌తో ఐశ్వర్య తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత హిందీ, తమిళంలో వరుస చిత్రాలు చేసింది. దేవదాస్, జోధా అఖ్బర్, ధూమ్ 2, హమ్ దిల్ దే చుకే సనమ్ చిత్రాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. రీసెంట్ గా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’లో నటించిన విషయం తెలిసిందే.  

 

Follow Us:
Download App:
  • android
  • ios