Mandakini Trailer: ఆహాలో సరికొత్త డైలీ సీరియల్ మందాకిని... ఆసక్తి రేపుతున్న ట్రైలర్!
తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహా తన చందాదారుల కోసం సరికొత్త డైలీ సీరియల్ తీసుకొచ్చింది. ఫాంటసీ సస్పెన్సు థ్రిల్లర్ మందాకిని సీరియల్ స్ట్రీమ్ అవుతుంది.
నాన్ స్టాప్ ఎంటర్టైనర్ తో ఆదరణ పెంచుకుంటూ పోతుంది ఆహా యాప్. తాజాగా 'మందాకిని' అనే కొత్త డైలీ సీరియల్‌ని ప్రారంభించారు, సస్పెన్సు ఫాంటసీ జానర్ లో తెరకెక్కిన మందాకిని మార్చి 6 నుండి ఆహాలో ప్రదర్శించబడుతుంది. ఈ సీరియల్ ప్రారంభ ఎపిసోడ్‌లు ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి. బుల్లితెర స్టార్స్ నిరుపమ్ పరిటాల, వాసుదేవ్ రావుతో పాటు పలువురు సీరియల్ అద్భుతమన్నారు.
గతంలో ఆహా 'Mr. పెళ్లాం' వంటి సక్సెస్ ఫుల్ డైలీ సీరియల్ అందించింది. తాజాగా సస్పెన్స్ ఫాంటసీ అంశాలతో కూడిన 'మందాకిని' సీరియల్ ప్రేక్షకుల కోసం తీసుకువచ్చింది. ఈ డైలీ సీరియల్ యాడ్ డైరెక్టర్ ఆర్య (Rk చందన్) , మందాకిని అనే విలేజ్ గర్ల్ చుట్టూ తిరుగుతుంది. తన యాడ్ లో నటించడానికి అందమైన అమ్మాయి కోసం ఆర్య వెతుకుతుంటాడు. ఆ క్రమంలో అతను మందాకిని (హిమబిందు)ని చూస్తాడు. అయితే మందాకిని ఒక శాపంతో పీడించబడుతుంటుంది. ఆమెను శాపం నుండి బయటపడేసేందుకు ఆర్య ఒక పురాతన ఆలయంలో మందాకినితో పూజ చేయించాల్సి ఉంటుంది. ఈ పూజకు కళింగ వర్మ (మిథున్) అడ్డుపడుతుంటాడు. మరి ఆర్య తన డ్రీమ్ గర్ల్ తో పూజ చేయించాడా? మందాకిని ని సమస్య నుండి బయటపడేశాడా? అన్నదే ఈ సీరియల్ ఇతివృత్తం. మందాకిని సీరియల్ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది.
డైలీ సీరియల్ లాంచింగ్ ఈవెంట్లో పాల్గొన్న ఆర్కే చందన్ సీరియల్ అద్భుతంగా ఉంటుందన్నారు. సక్సెస్ పై విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి రోజు మధ్యాహ్నం 2:30 నిమిషాలకు మందాకిని సీరియల్ ఆహా లో స్ట్రీమ్ కానుంది. సోమవారం నుండి గురువారం వరకు వారానికి ఐదు ఎపిసోడ్స్ ప్రసారం కానున్నాయి. మొదటి 8 ఎపిసోడ్స్ ఫ్రీగా వీక్షించవచ్చని వెల్లడించారు. హిమబిందు, ప్రియా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఆర్కే చందన్ హీరో. ఇక వర్ష అజయ్, సాయి కిరణ్, జయలలిత కీలక పాత్రలు చేస్తున్నారు.