Asianet News TeluguAsianet News Telugu

ఆ ఇద్దరు హీరోయిన్స్ తో ప్రైవేట్ పార్టీలో అఖిల్...!


అఖిల్ లేటెస్ట్ మూవీ ఏజెంట్ నేడు విడుదలైంది. ఈ చిత్రంలో ఐటెం సాంగ్ చేసిన ఊర్వశి రాతెలా ఓ త్రో బ్యాక్ ఫోటో షేర్ చేయగా వైరల్ అవుతుంది. 
 

agent star akhil trow back pic getting viral ksr
Author
First Published Apr 28, 2023, 9:09 AM IST

అక్కినేని హీరో అఖిల్ బాలీవుడ్ హీరోయిన్స్ తో ఉన్న త్రోబ్యాక్ పిక్ ఒకటి వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో అఖిల్ పక్కన ఊర్వశి రాతెలా, శ్రద్దా కపూర్ ఉన్నారు. ఒక నైట్ పార్టీలో వీరందరూ కలిసినట్లు ఆ ఫోటో ఉంది. హీరోయిన్ ఊర్వశి రాతెలా ఈ ఫోటోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఏడేళ్ల క్రితం మేము ఇలా కలిశామంటూ ఆ ఫోటోకి కామెంట్ పెట్టారు. అంటే చాలా కాలం క్రితం నుండే అఖిల్ బాలీవుడ్ ప్రైవేట్ పార్టీలు, ఫంక్షన్స్ లో పాల్గొనేవారన్న విషయం వెలుగులోకి వచ్చింది. 

కాగా అఖిల్ లేటెస్ట్ మూవీ ఏజెంట్ లో ఊర్వశి రాతెలా ఆయనతో కలిసి ఓ సాంగ్ చేశారు. వైల్డ్ సాలా అనే ఐటెం సాంగ్ లో కలిసి ఆడిపాడారు. ఈ సాంగ్ షూటింగ్ అఖిల్ ఊర్వశి పాత్ర అసభ్యంగా ప్రవర్తించాడంటూ వివాదాస్పద ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు ట్వీట్ చేశారు. దీనిపై ఫైర్ అయిన ఊర్వశి అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ ట్వీట్ చేశారు.

ఊర్వశి రాతెలా ఈ ఏడాది చిరంజీవికి జంటగా ఒక సాంగ్ చేశారు. వాల్తేరు వీరయ్య మూవీలో 'బాస్ పార్టీ' సాంగ్ లో ఆమె ఆడిపాడారు. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ కాగా... బాస్ పార్టీ సాంగ్ హైలెట్ అయ్యింది. అలాగే నెక్స్ట్ రామ్ పోతినేని-బోయపాటి మూవీలో ఊర్వశి కనిపించనున్నారు. ఏజెంట్ ఆమెకు తెలుగులో రెండో చిత్రం. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.  హిప్ హాప్ తమిజా సంగీతం అందించారు. ఏ కే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఏజెంట్ చిత్రానికి వక్కంతం వంశీ కథ సమకూర్చారు.   

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios