చిన్న సినిమాకు రిలీజ్ కు ముందు బిజినెస్ అవ్వటమే గగనం. అలాంటి ది లాభాలు రావాలంటే మంచి బజ్ మార్కెట్ క్రియేట్ కావాలి. అప్పుడే ఆ సినిమా కొనేందుకు డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ ఆసక్తి చూపిస్తారు. అలాంటి మ్యాజిక్కే ‘ఏజెంట్‌ సాయిశ్రీనివాస ఆత్రేయ’ జరిగిందని సమాచారం.  ఈ చిత్రం ట్రైలర్ తో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. దాంతో ఈ సినిమా ఎ సెంటర్లలలో హాట్ కేకులా నడుస్తుందని ట్రేడ్ లో అంచనాలు ఏర్పడ్డాయి. 

దానికి తోడు ఈ చిత్ర నిర్మాతలు సైతం ఈ సినిమాని ఓ పెద్ద సినిమా స్దాయిలో ప్రమోట్ చేస్తున్నారు. మరో ప్రక్క ఈ సినిమా ఇన్ సైడ్ టాక్ ప్రకారం చాలా బాగా వచ్చిందని, థ్రిల్ తో పాటు ఫన్ ఎలిమెంట్స్ బాగా పండాయని అంటున్నారు. ఇవన్నీ ఈ చిత్రం ప్రీ రిలీజ్  బిజినెస్ పై ప్రభావం చూపాయి. ఓవర్ సీస్ నుంచి అరవై లక్షల రూపాయిల బిజనెస్ జరిగిందని తెలుస్తోంది. దీనికి తోడు నిర్మాతలు ఈ చిత్రంపై ఉన్న కాన్ఫిడెన్స్ తో సినిమాని చూపించి మరీ డిస్ట్రిబ్యూటర్స్ కు అమ్ముతున్నరు. చాలా తక్కువ బడ్జెట్ తో రెడీ అయ్యిన ఈ చిత్రం చాలా తక్కువ రేట్లు చెప్పటంతో హాట్ కేక్ లా అమ్ముడైందని వినికిడి. దాంతో నిర్మాతలు రిలీజ్ కు ముందే లాభాలు వెనకేసుకున్నారని చెప్తున్నారు. 

 చిత్రం విశేషాలకు వెళ్తే...నవీన్‌ పొలిశెట్టి, శృతి శర్మ ప్రధాన పాత్రల్లో స్వరూప్‌ ఆర్‌.ఎస్‌.జె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్‌ సాయిశ్రీనివాస ఆత్రేయ’. స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ‘మళ్ళీరావా’ చిత్రాన్ని నిర్మించిన రాహుల్‌ యాదవ్‌ నక్కా రూపొందించిన ఈ సినిమా ‘యు/ఎ’ సర్టిఫికెట్‌ అందుకుంది. ఈనెల 21న సినిమా విడుదల కానుంది. 

 నవీన్‌ ఈ చిత్రంలో డిటెక్టివ్‌ పాత్రలో నటించాడు. డిఫరెంట్‌ టేకింగ్, స్క్రీన్‌ప్లేతో సాగే కాన్సెప్ట్‌ బేస్డ్‌ మూవీ ఇది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది. మార్క్‌ కె.రాబిన్‌ సంగీతం, సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అవుతాయి.