Asianet News TeluguAsianet News Telugu

'ఏజెంట్' OTT తిప్పలు, ఆ పని చేసాకే స్ట్రీమింగ్?

 ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్గా నటించగా, మలయాళ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్ర పోషించారు. సుమారు 80 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది.

Agent New Version getting ready for Digital Release On #Sonyliv
Author
First Published Jun 1, 2023, 2:22 PM IST


అఖిల్  లేటెస్ట్ మూవీ 'ఏజెంట్' ఓటీటీ రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. నిజానికి మే 19 అంటే ఈ రోజు నుంచి ప్రముఖ ఓటీటీ సోనీ లీవ్ లో 'ఏజెంట్' మూవీ స్ట్రీమింగ్ కావాల్సి ఉంది.  కానీ కాలేదు. అందుకు కారణం ఈ సినిమా న్యూ ఎడిటింగ్ వెర్షన్ ని రిలీజ్ చేయాలనుకోవటమే అని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..

 స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్పై యాక్షన్ డ్రామాగా రూపొందిన 'ఏజెంట్' మూవీ ఏప్రిల్ 28న థియేటర్స్ లో విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.  దాంతో ఓటిటిలో త్వరగా రిలీజ్ చేద్దామనుకున్నారు. 

కానీ..థియేటర్లలో ఈ  సినిమా రిలీజైన  కొన్ని రోజులకు నిర్మాత,  హీరో అఖిల్ ఈ సినిమా పరాజయం గురించి పోస్ట్ లు పెట్టారు.  ఇందులో డైరెక్టర్ సురేందర్ రెడ్డి పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని తెలిసిపోయింది. మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. అయితే సినిమా డిజాస్టర్ అవ్వటానికి కారణం ఎడిటింగ్ హడావిడిగా చేయటమే అని భావించిన దర్శకుడు ఇప్పుడు కొత్త వెర్షన్ ని రెడీ చేసి సోనీ లివ్ కు ఇస్తున్నారట. లేకపోతే భారీ రేటు పెట్టి కొనుక్కున్న సోనీ లివ్..రిజల్ట్ చూసి భయపడి ..ఎగ్రిమెంట్ తిరిగి రాసుకుందామని, తక్కువ ఎమౌంట్ కోట్ చేసారట. ఈ క్రమంలో రేటు మార్చకుండా ..రీఎడిట్ చేసి ఇస్తున్నారని సమాచారం.
 
కొన్ని సీన్లు ఎడిట్ చేసి ఓటీటీలో ‘ఏజెంట్’ని రిలీజ్ చేయాలనేది ప్లాన్ అని సమాచారం. అందుకే ఇంత లేటు అవుతోందని చెప్తున్నారు. అయితే ఇందులో ఎంతనిజం ఉందనే ‘ఏజెంట్’ ఓటీటీలో విడుదలైతే గానీ తెలియదు.   ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్గా నటించగా, మలయాళ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్ర పోషించారు. సుమారు 80 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది.

ఏదైమైనా అక్కినేని అఖిల్ హీరోగా ఇప్పటివరకు 5 సినిమాలు చేశాడు. వాటిలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ యావరేజ్ అనిపించుకుంది కానీ మిగతావన్నీ దారుణమైన రిజల్ట్స్ అందుకున్నాయి. ఏప్రిల్ చివర్లో వచ్చిన ‘ఏజెంట్’పై అఖిల్ గట్టిగానే నమ్మకం పెట్టుకున్నాడు. కానీ కంటెంట్ ఏ మాత్రం సరిగా లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాను తిరస్కరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios