దీప్తి సోషల్ మీడియాలో పరోక్షంగా తన కోపాన్ని, అసహనాన్ని బయటపెట్టారు. ఇక బ్రేకప్ రూమర్స్ మొదలైన రోజుల వ్యవధిలో దీప్తి సునైన బ్రేకప్ కన్ఫర్మ్ చేసింది. 

బిగ్ బాస్ (Bigg Boss Telugu 5) ఓ పచ్చని జంటను విడగొట్టాడు. దాదాపు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న షణ్ముఖ్-దీప్తి షణ్ముఖ్ లు విడిపోవడానికి కారణమైంది. హౌస్ లో షణ్ముఖ్ తోటి కంటెస్టెంట్ సిరితో నడిపిన ప్రేమాయణం ప్రేమ పక్షుల మధ్య చిచ్చు పెట్టింది. ఖచ్చితంగా ఇదే కారణం అంటూ షణ్ముఖ్, దీప్తి నోరు విప్పకపోయినా.. పరిణమాలు గమనిస్తే మాత్రం, అదే భావన కలుగుతుంది. షణ్ముఖ్ హౌస్ నుండి బయటికి వచ్చిన రోజుల వ్యవధిలోనే దీప్తితో బ్రేకప్ రూమర్స్ చక్కర్లు కొట్టాయి. 

దీప్తి సోషల్ మీడియాలో పరోక్షంగా తన కోపాన్ని, అసహనాన్ని బయటపెట్టారు. ఇక బ్రేకప్ రూమర్స్ మొదలైన రోజుల వ్యవధిలో దీప్తి సునైన బ్రేకప్ కన్ఫర్మ్ చేసింది. ఎందుకు విడిపోయారనేది వారి వ్యక్తిగత విషయం. అయితే బిగ్ బాస్ షోలో సిరి (Siri)-షణ్ముఖ్ మధ్య నడిచిన బంధం నేపథ్యంలో సిరినే అందరూ తప్పుబడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆమెను బ్లేమ్ చేస్తున్నారు. 

బ్రేకప్ ప్రకటన తర్వాత ఇంస్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ తో మాట్లాడారు దీప్తి. ఇకపై తన గురించి ఆలోచిస్తానని, సీరియస్ గా కెరీర్ పై ఫోకస్ చేస్తానని చెప్పారు. ఇదిలా ఉంటే దీప్తి-షణ్ముఖ్ ల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిగ్ బాస్ షోకి వెళ్లబోయే ముందు షణ్ముఖ్-దీప్తితో కలిసి మలుపు పేరుతో ఒక సిరీస్ చేశారు. ఈ సిరీస్ లోని ఓ సాంగ్ మేకింగ్ వీడియో యూట్యూబ్ లో విడుదల చేయగా అది వైరల్ గా మారింది. 

ఇక సదరు మేకింగ్ వీడియో గమనిస్తే షణ్ముఖ్, దీప్తి షూటింగ్‌ సమయంలో బాగా ఎంజాయ్ చేశారని అర్థమవుతుంది. షణ్ను ఆస్పత్రి బెడ్‌పై పడుకుంటే కొంచెం జరగమంటూ దీప్తి వచ్చి షణ్ముఖ్ ఎదపై పడుకుంది. దీంతో షణ్నూ 'నేను చనిపోయేటప్పుడు కూడా దీప్తి ప్లేస్‌ ఇవ్వమని గొడవపడుతుంది, ఎందుకు జరగవని వాదిస్తుంది' అని చెప్పడంతో దీప్తి నవ్వుతూ అతని ఎద పై వాలిపోయింది.

ఆ తర్వాత షణ్ముఖ్ (Deepthi Sunaina) ప్రేమగా ఓ ముద్దివ్వగా ఆమె కన్నార్పకుండా అతడ్ని అలానే చూస్తుండిపోయింది. ఇలా వీరిద్దరూ కలిసి ఉన్న క్షణాలను చూసి ఫ్యాన్స్‌ ఎమోషనల్‌ అవుతున్నారు. 'మీ జంట చూడముచ్చటగా ఉంది, వీడియో చూస్తుంటే కళ్లు చెమర్చుతున్నాయి', 'మీరిద్దరూ కలిసి నటించిన చివరి సాంగ్‌ ఇదే అవుతుందనుకోలేదు', 'ఎంతో ఆప్యాయంగా ఉండే మీరు మళ్లీ కలవాలి' అని కోరుతూ కామెంట్లు పెడుతున్నారు. వంద రోజుల రియాలిటీ షో వల్ల భవిష్యత్తును పాడు చేసుకోకండి సూచిస్తున్నారు. కాగా శనివారం రిలీజ్‌ చేసిన మలుపు మేకింగ్‌ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది. 

ఇక దీప్తి, షణ్ముఖ్ (Shanmukh) ఎవరి కెరీర్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. బ్రేకప్ బాధ నుండి బయటపడడం అంత సులభం కాదు. అయితే అదే తలచుకుంటూ కూర్చుంటే జీవితం ముందుకు నడవదు. ఈ విషయం బాగా తెలిసిన షణ్ముఖ్, దీప్తి తమ తమ పనుల్లో బిజీ అయ్యారు. అలాగే వర్క్ లో ఇన్వాల్వ్ కావడం ద్వారా ఇలాంటి బాధలను మర్చిపోవచ్చు. కలిసి అనేక సాంగ్స్, సిరీస్లు, షార్ట్ ఫిలిమ్స్ చేసిన ఈ జంట... మరలా కలవాలని గట్టిగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వారి కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి. 

YouTube video player