అలయ్ బలయ్ వేదికపై ఎడమొహం పెడమొహంగా మంచు విష్ణు పవన్... వైరల్ గా మంచు విష్ణు ట్వీట్!
వేదికపై కూర్చొని ఉన్న Pawan klayan కి సంబంధించిన వీడియో క్లిప్ మంచు విష్ణు తన ట్విట్టర్ లో షేర్ చేయడం విశేషం. 'వీడియో చివర కనిపించిన వ్యక్తి ఎవరో ఊహించండి..' అంటూ సదరు వీడియోకి మంచు విష్ణు కామెంట్ పెట్టారు.
హైదరాబాద్ జలవిహార్ వేదికగా అలయ్ బలయ్ వేడుక ప్రాంభమైంది. బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. Alai balai కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ వేడుకకు చిత్ర పరిశ్రమ నుండి మంచు విష్ణు, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఒకే వేదికపై వీరు పరస్పరం ఎదురుపడడం జరిగింది.
అయితే వేదికపై కూర్చొని ఉన్న Pawan klayan కి సంబంధించిన వీడియో క్లిప్ మంచు విష్ణు తన ట్విట్టర్ లో షేర్ చేయడం విశేషం. 'వీడియో చివర కనిపించిన వ్యక్తి ఎవరో ఊహించండి..' అంటూ సదరు వీడియోకి మంచు విష్ణు కామెంట్ పెట్టారు. అలయ్ బలయ్ వేదికపై వీరి మధ్య సంభాషణలు జరగలేదని తెలుస్తుంది.
మా ఎన్నికలలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. నాన్ లోకల్ వాదనను కూడా తప్పుబట్టిన పవన్ పరోక్షంగా Manchu vishnu ప్యానెల్ పై విమర్శలు చేశారు. రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుకలో మోహన్ బాబుపై పవన్ కొన్ని కామెంట్స్ విసిరారు. వాటికి ధీటుగా మంచు విష్ణు ప్యానెల్ తరపు సభ్యులు సమాధానం చెప్పారు.
ఇంత వివాదం పవన్, మంచు విష్ణు మధ్య ఎన్నికల కారణంగా ఏర్పడింది.
Also read సమంత చైతూ విడాకులు...అతడు గే, విబేధాలకు కారణం అదే, అసలు సీక్రెట్స్ బయటపెట్టిన శ్రీరెడ్డి
అయితే ఎన్నికలలో గెలిచిన అనంతరం మంచు మనోజ్ పవన్ కళ్యాణ్ ని స్వయంగా కలిశారు. భీమ్లా నాయక్ సెట్స్ లో మంచు మనోజ్, పవన్ మధ్య గంటకు పైగా సంభాషణ జరిగినట్లు సమాచారం. ఫలితాల అనంతరం కూడా ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు, మంచు విష్ణు ప్యానెల్ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే.
Also read అఖిల్ షాకై ఉంటాడు: ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కలెక్షన్స్
నిన్న జరిగిన మంచు విష్ణు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చిరంజీవికి ఆహ్వానం అందలేదు. కనీసం మాట వరసకు కూడా Chiranjeevi ని మంచు ఫ్యామిలీ నుండి ఎవరూ పిలవలేదు. ఈ కార్యక్రమానికి పరిశ్రమ పెద్దలను పిలిచినా, ఎవరూ పెద్దగా హాజరు కాలేదు. మోహన్ బాబుకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. బాలకృష్ణను ప్రత్యేకంగా ఆహ్వానించినా ఆయన రాలేదు.