టాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన ఆన్ స్క్రీన్ జోడీలలో జూనియర్ ఎన్టీఆర్, సమీరారెడ్డి జంట కూడా ఉంది. అశోక్, నరసింహుడు చిత్రాల్లో వీరిద్దరూ కలసి నటించారు. అప్పట్లో ఎన్టీఆర్, సమీరారెడ్డి గురించి మీడియాలో అనేక రకాలుగా వార్తలు వచ్చాయి. కానీ సమీరారెడ్డి హీరోయిన్ గా మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే అక్షయ్ వార్థే అనే వ్యాపారవేత్తని వివాహం చేసుకుని స్థిరపడింది. 

ఎన్టీఆర్ టాలీవుడ్ లో టాప్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం సమీరారెడ్డి మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. ఇప్పటికే ఆమెకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. ప్రస్తుతం సమీరారెడ్డి గర్భవతి. త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇటీవల సమీరారెడ్డి హైదరాబాద్ లో ఓ ఈవెంట్ లో పాల్గొనేందుకు వచ్చింది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించింది. 

తెలుగులో ఏ హీరో సినిమాలు చూస్తున్నారు అని ప్రశ్నించగా.. నేను నటించిన జూ. ఎన్టీఆర్ సినిమాలే ఎక్కువగా చూస్తుంటా అంటూ సమాధానం ఇచ్చింది. నరసింహుడు, అశోక్, జై చిరంజీవ, చిత్రాల్లో నటించింది. రానా నటించిన కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో ప్రత్యేక గీతంలో నర్తించింది.