Asianet News TeluguAsianet News Telugu

రియల్ లైఫ్ భర్త కన్నా.. రీల్ లైఫ్ భర్తతోనే ఎక్కువగా గడుపుతున్న అనుష్క

ఈ సినిమాలో నా రీల్ భ‌ర్త‌తో గ‌డిపిన స‌మ‌యం కంటే.. నా రియ‌ల్ భ‌ర్త‌తో గ‌డిపిన స‌మ‌యం త‌క్కువ‌` అని అనుష్క‌ చెప్పింది.

After Getting Married, I Don't Even Get That Much Time to Spend With Virat: Anushka Sharma
Author
Hyderabad, First Published Aug 14, 2018, 3:13 PM IST

తాను తన రియల్ లైఫ్ భర్త విరాట్ కోహ్లీ కన్నా... రీల్ లైఫ్ భర్త వరుణ్ ధావన్ తోనే ఎక్కువ సమయం గడుపుతున్నట్లు బాలీవుడ్ బ్యూటీ అనుష్కశర్మ అన్నారు. అనుష్క శర్మ,, వరుణ్ ధావన్ జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సూయీ ధాగా’. ఈ చిత్ర ట్రైలర్ ని సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ.. సినిమా విశేషాలతోపాటు తన వ్యక్తిగత జీవితం గురించి కూడా వివరించారు.

`ఓ గృహిణి ఎలా ఉండాల‌నే విష‌యాన్ని ఈ సినిమా ద్వారానే నేర్చుకున్నాను. నేను ప‌దిహేనేళ్ల వ‌య‌సు నుంచే సంపాదిస్తున్నా. పెళ్లి చేసుకున్న త‌ర్వాత కూడా నా ప‌నిని కొన‌సాగిస్తున్నా. ఎన్నో విష‌యాలు నేర్చుకున్నా. అయితే ఈ సినిమా మ‌రో కొత్త విష‌యం నేర్పింది. ఇంటిప‌ట్టునే ఉంటూ అన్ని ప‌నులూ చూసుకునే భార్య‌గా ఈ సినిమాలో న‌టించా. ఈ సినిమాలో నా రీల్ భ‌ర్త‌తో గ‌డిపిన స‌మ‌యం కంటే.. నా రియ‌ల్ భ‌ర్త‌తో గ‌డిపిన స‌మ‌యం త‌క్కువ‌` అని అనుష్క‌ చెప్పింది. అలాగే ఇటీవ‌ల లండ‌న్‌లో టీమిండియ‌తో దిగిన ఫోటో వివాదాస్ప‌దం కావ‌డం గురించి మాట్లాడుతూ.. ఆ వివాదం గురించి స్పందించాల్సిన వారు స్పందించార‌ని, నెటిజ‌న్ల కామెంట్ల‌ను తాను అంత‌గా పట్టించుకోన‌ని స్ప‌ష్టం చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios