46 ఏళ్ల తరువాత అక్కడ అడుగు పెట్టిన రజనీకాంత్, సూపర్ స్టార్ షూటింగ్ ఎక్కడంటే..?
70 ఏళ్ళు దాటినా.. కుర్రాళ్లను మించి ఉరుకులు పెడుతూ.. షూటింగ్ లో పాల్గొంటున్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. వరుస ప్లాప్ లు చూసిన ఆయన రీసెంట్ గా సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. నెక్ట్ మూవీస్ ను కూడా వరుసగా లైన్ అప్ చేస్తున్నాడు సూపర్ స్టార్.
ఇక రజనీకాంత్ పనైపోయింది.. ఆయనకు మార్కెట్ లేదు అని ప్రచారం చేసిన వారికి జైలర్ సినిమాతో గట్టిగా కౌంటర్ ఇచ్చాడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఈమూవీతో అదిరిపోయేలెవల్లో కంబ్యాక్ ఇచ్చిన రజనీ.. అదే ఊపుతో తన 170వ సినిమా చేస్తున్నాడు. జై భీమ్ దర్శకుడు జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా కేరళలో స్టార్ట్ అయ్యింది.
తిరువునంతపురంలోని అగ్రీకల్చర్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఫస్ట్ షెడ్యూల్ ను స్టార్ట్ చేసిన తలైవా.. ఈ మధ్యే ఓ మేజర్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని తిరునల్వేలిలో స్పెషల్ గా వేసిన సెట్‌లో జరుగుతోంది. అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ షూటింగ్ స్పాట్ కు.. సూపర్ స్టార్ కు మధ్య ఓ చిన్న అనుబధం ఉంది. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గతంలో రజినీకాంత్ కు సబంధించిన ఓ మూవీ షూటింగ్ ఇక్కడ జరిగింది. దాదాపు 46ఏళ్ల తర్వాత రజనీకాంత్ సినిమా అక్కడ షూటింగ్ జరుగుతుంది. 1977లో భువన ఒరు కెల్వి కురి సినిమా షూటింగ్ అక్కడ జరిగిందట. ముత్తురామన్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా రజనీ కెరీర్ లో మర్చిపోలేని సినిమాగా నిలిచింది. ఆ తర్వాత ఇప్పటివరకు రజనీ సినిమా అక్కడ షూటింగ్ జరుపలేదు. అంతేకాకుండా రజనీ నటించిన ముత్తు సినిమా ఈ ప్రాంతంలో ఒకేసారి రెండు థియేటర్లలో విడుదలై.. రెండు చోట్ల వందరోజులు పూర్తి చేసుకుంది. ఇలా రజనీకి ఆ ప్రాంతం మంచి అనుబంధంతో కూడిన అనుభవాలను మిగిల్చింది.
ఇక ప్రస్తుతం చేస్తున్న సినిమా షూటింగ్ గత వారం రోజులుగా అక్కడే జరుగుతుంది. రజనీను చూసేందుకు వందలాది ఫ్యాన్స్ వస్తున్నారు. ఇక ఈ సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలు పెరిగిపోతున్నాయి. రోజుకో కాస్ట్‌ను రివీల్ చేస్తూ అంతకంతకూ సినిమాపై ఎక్సట్‌పెక్టేషన్స్ పెంచుకుంటూ వస్తున్నారు. అమితాబ్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, ఫాహద్ ఫాజిల్ ఇలా సౌత్‌లోని పలు ఇండస్ట్రీల స్టార్ కాస్ట్ ఈమూవీలో సందడి చేయబోతున్నారు.
సూర్యతో సెన్సేషనల్ మూవీ జైభీమ్ చేసిన తరువాత జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ ఈ మూవీపై స్పెషల్ ఇంట్రెస్ట్ క్రేయేట్ అయ్యింది.లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుంది. జైలర్‌తో ఊరమాస్ మ్యూజిక్ ఇచ్చిన అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు కూడా సంగీతం అందించనున్నాడు.