క్షణం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్‌.. గూఢాచారి చిత్రంతో తెలుగువారి దృష్టిని ఆకర్షించాడు. డిఫెరెంట్‌ జానర్‌లో సినిమాలను చేస్తూ.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటోన్న అడివి శేష్‌.. మరో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఎవరు’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు.

స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా  రిలీజైన ఎవరు. మార్నింగ్ షోకే హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా టీమ్ కు మంచి ఉత్సాహాన్ని ఇస్తోంది. ఈ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడంటూ అడవిశేషు అని అందరు తెగ మెచ్చుకుంటున్నారు. టైట్ స్క్రీన్ ప్లే తో సాగే ఈ సినిమా ఫ్యాన్స్‌కు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చిన శేష్‌ ని అందరు తెగ మెచ్చుకుంటున్నారు. అయితే అదే సమంయలో కొంత మంది అభిమానులు అత్యుత్సాహంతో సినిమాలోని కీలక ‍ట్విస్ట్‌లను సోషల్ మీడియాలో లీక్‌ చేస్తున్నారు. థ్రిల్లర్ సినిమాలకు కీ ట్విస్ట్ లు తెరపై  పేలటమే ప్లస్. అవి ఎంత బాగా రివీల్ అవుతాయి..ప్రేక్షకులు ఊహించరు అనేది ప్లస్ అవుతుంది.

కానీ కొందరు మాత్రం ఇంటర్వెల్ సీన్‌, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌లను సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఈ లీకులపై ఎవరు టీం రియాక్ట్ అవుతూ ఓ వీడియో వదిలింది.  అందులో అడివి శేష్‌, నవీన్‌ చంద్ర, రెజీనాలు ట్విస్ట్‌లకు సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయోద్దని రిక్వెస్ట్ చేశారు. తనకు ఘనవిజయాన్ని అందించిన అభిమానుకుల కృతజ్ఞతలు తెలియజేశారు.

అడివి శేష్, రెజీనా జంటగా నవీన్‌ చంద్ర కీలక పాత్రలో వెంకట్‌ రామ్‌జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎవరు’. పివిపి సినిమా పతాకంపై పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కెవిన్‌ అన్నె నిర్మించిన ఈ సినిమా ఈనెల 15న విడుదల అయ్యింది.