ఐడియా టెలికాం కంపనీపై టాలీవుడ్ కుర్ర హీరో అడివి శేష్ మండిపడ్డాడు. తాను విదేశాలకు వెళ్లే సమయంలో ఐడియా కంపనీ ఇంటర్నేషనల్ ప్యాక్ తో రీచార్జ్ చేయించుకున్నానని, కానీ విదేశాల్లో ఆ ప్యాక్ పనిచేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయమై ఫిర్యాదు చేసినా ఐడియా కంపనీ తన డబ్బుని రీఫండ్ చేయలేదని, ఆ సంస్కారం కూడా లేదని విమర్శించారు. డబ్బులు ముఖ్యం కాదని, ఐడియా కంపనీ  అనైతికంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. ఇక హైదరాబాద్ లో కాల్ క్వాలిటీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని ఎద్దేవా చేశారు.

ఈ విషయంలో ఐడియా ప్రతినిధుల స్పందన అధ్బుతంగా ఉందనీ.. వాళ్లకి కనీస పరిజ్ఞానం కూడా లేదని విమర్శించారు. దీనికి తోడు ప్రతీరోజు తనకు స్పామ్ కాల్స్ ఎక్కువయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కారణాల వలన తాను ఐడియా నెట్ వర్క్ నుండి మారిపోతున్నట్లు చెప్పారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ హీరో 'ఎవరు' అనే సినిమాలో నటిస్తున్నాడు.