Asianet News TeluguAsianet News Telugu

విదేశీ దేవుడు కాదు, నేను ఆయనతో మాట్లాడుతా... బాలయ్య హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన హీరోయిన్ మోహిని క్రిస్టియానిటీ పట్ల ఆకర్షితులు అయ్యారంటే నమ్మబుద్ది కాదు. మతానికి తగ్గట్లుగా పేరు కూడా మార్చుకున్న మోహిని, తాను నేరుగా దేవునితో మాట్లాడుతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

aditya 369 fame mohini says she used to talk with god
Author
Hyderabad, First Published Aug 1, 2021, 9:38 AM IST

మతసామరస్యం అధికంగా మన దేశంలో చూడగలం. హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ మతాలకు చెందిన ప్రజలు చాలా చోట్ల కలిసి మెలిసి జీవనం సాగిస్తున్నారు. అదే సమయంలో కొన్ని చోట్ల ఈ మతాల వలన గొడవలు, సంఘర్షణలు జరుగుతూ ఉంటాయి. ఒక మతం నుండి వేరే మతానికి మారడం కూడా మన దేశంలో ఎక్కువే. 


సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన హీరోయిన్ మోహిని క్రిస్టియానిటీ పట్ల ఆకర్షితులు అయ్యారంటే నమ్మబుద్ది కాదు. మతానికి తగ్గట్లుగా పేరు కూడా మార్చుకున్న మోహిని, తాను నేరుగా దేవునితో మాట్లాడుతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిత్య 369, డిటెక్టివ్ నారద వంటి చిత్రాలలో నటించిన మోహిని, తాను నమ్మిన దేవుని గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. 


మోహిని మాటల్లో... 'క్రీస్తు అంటే విదేశీ దేవుడు కాదు. సుమారు ఐదువేల సంవత్సరాల క్రితం నాటి ఋగ్వేదంలో ఏసుస్వామి గురించి ఉంది. అందుకే అనేక మంది పాస్టర్లు ఇప్పుడు ఋగ్వేదం చదువుతున్నారు. ఋగ్వేదం ప్రకారం- ఒక కన్యకు ప్రజాపతి అనే దైవదూత పుడతాడు. ఆయనను ఒక చెట్టుకు కట్టి, మూడు శీలలను ఉపయోగించి చంపుతారు. ఆ శీలల సైజు ఎంతో కూడా దానిలో ఉంది. ప్రజాపతి అంటే మొదటి మగవాడు, కొడుకు, భర్త, సోదరుడు, అధిపతి.. ఇలా రకరకాల అర్థాలు తీసుకోవచ్చు. మొత్తం మీద ప్రజాపతి అంటే బ్రహ్మ మొదటి కుమారుడు అని అర్థం. ప్రతి యజ్ఞంలోను పుర్ణాహుతిని ప్రజాపతికే అర్పిస్తారు. బ్రాహ్మణులకు 12 గోత్రాలు ఉన్నట్లే.. క్రైస్తవంలో 12 తెగలు ఉన్నాయి. బ్రాహ్మణులు ప్రజాపతికి పూర్ణాహుతి ఇస్తారు. మురుగనకు ఇచ్చినా, నారాయణుడికి ఇచ్చినా, అమ్మవారికి ఇచ్చినా.. ఆ పూర్ణాహుతి వెళ్లేది ప్రజాపతికే. ఆ ప్రజాపతినే నేను విశ్వసిస్తున్నాను..'

'నేను క్యాథలిక్‌గా మారిన తర్వాత పేరును క్రిస్టియానాగా మార్చుకున్నా. నా జీవితమంతా కేథలిక్‌గా ఉండాలనే ఉద్దేశంతో పేరును మార్చుకున్నా. నేను క్రీస్తు పట్ల పరిపూర్ణమైన విశ్వాసంతో ఉన్నా. నేను ఆయనతో మాట్లాడతా. మనం చేసే ప్రార్థనలే మనల్ని ఆయనకు దగ్గరగా చేరుస్తాయి. నేను ఏ పనిచేయాలన్నా.. ఆయనకు చెప్పి, ప్రార్థన చేస్తా. అది పూర్తయ్యే సరికి ఒక ప్రశాంతమైన భావన కలుగుతుంది. అంటే ఆయన నా నిర్ణయాన్ని సమ్మతించినట్లు లెక్క. కొందరితో ఆయన నేరుగా కూడా మాట్లాడతారు. చాలా మంది ఇవి క్రైస్తవ మతంలోనే ఎందుకు ఉన్నాయని అడుగుతారు. హిందుమతంలో కూడా ఇవి ఉన్నాయి. కొందరు అమ్మవారు ఆవహించిందని పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. అప్పుడు ఏవేవో చెబుతూ ఉంటారు. వాటిని నమ్ముతారు కదా.. ఇస్లాంలో కూడా ఇలాంటివి ఉన్నాయి. దేవుడు అందరితోనూ మాట్లాడతాడు. కానీ మనం గుర్తించలేం అంతే!'.. అంటూ దేవుడు ఏసు పట్ల తన విశ్వాసం చాటుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios