అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ కలిసి ప్రేమలో ఉన్నారనే పుకార్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై అదితి స్పందించారు. ఆమె చెప్పిన సమాధానం షాకిచ్చేలా ఉంది.
హీరో సిద్ధార్థ్, అదితి రావు హైదరీ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు వీరిద్దరు కలిసి బయట తిరగడంతో ఆ రూమర్లకి బలం చేకూరింది. ఆ మధ్య శర్వానంద్ ఎంగేజ్‌మెంట్ వేడుకలో పాల్గొన్నారు. వీరిద్దరు కలిసి రావడమే కాదు, కలిసి ఫోటో దిగారు. దీంతో ఈ రూమర్లు మరింత ఊపందుకున్నాయి. దీనికితోడు తాజాగా ఇద్దరు కలిసి ఓ తమిళ పాటకి రీల్ చేశారు. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది అదితి రావు హైదరీ. ఇంతకంటే క్లారిటీ ఏం కావాలని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు.
సిద్ధార్థ్, అదితి బహిరంగంగానే ప్రేమించుకుంటున్నారని, ఇదే సాక్ష్యం అంటూ రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా దీనిపై అదితి రావు హైదరీ స్పందించింది. ఓ మీడియాతో ఆమె ముచ్చటిస్తున్న క్రమంలో సిద్ధార్థ్‌తో లవ్ ఎఫైర్‌కి సంబంధించిన ప్రశ్న ఎదురయ్యింది. దీనిపై ఆమె ఘాటుగా స్పందించింది. షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది అదితి. ఇందులో ఆమె పేర్కొంటూ తన వ్యక్తిగత విషయాలపై ఎందుకంత ఆసక్తి అంటూ ప్రశ్నించింది. పర్సనల్ విషయాలు కాదు, సినిమా కెరీర్‌పై దృష్టి పెట్టండి అని తెలిపింది.
అదితి మాట్లాడుతూ, తాను ఎవరితో రిలేషన్‌లో ఉన్నాననే దానిపై కాకుండా తన సినిమాల గురించి మాట్లాడితే బాగుంటుందని, ప్రస్తుతం తాను పలు సినిమాలతో బిజీగా ఉన్నానని, మంచి దర్శకులతో పనిచేయడం ఇష్టమని, కెరీర్ పై దృష్టి పెడుతున్నానని చెప్పింది. ఆడియెన్స్ తనని ఆదరించి తన సినిమాలు చూసేంత వరకు తాను సినిమాలు చేస్తానని వెల్లడించింది. కానీ సిద్ధార్థ్‌తో ప్రేమలో ఉన్నారా? లేరా అనేది మాత్రం ఆమె చెప్పలేదు.
అయితే ఆ విషయాన్ని పక్కదారి పట్టిస్తూ మాట్లాడటంతో రిలేషన్ షిప్‌ని క్లారిటీ ఇచ్చినట్టే అని అంటున్నారు నెటిజన్లు. నిజంగానే ఇద్దరి మధ్య ఏం లేకపోతే ఆ రూమర్స్ ని ఖండించేదని, లేదంటే తాము ఫ్రెండ్స్ అని చెప్పేది, అది కాకుండా ఆ విషయాన్ని పక్కన పెట్టి క్లాసులు పీకేలా ఆన్సర్ ఇవ్వడంతోనే తన లవ్ స్టోరీపై క్లారిటీ వస్తుందంటున్నారు అభిమానులు. ఏదేమైనా ఈ ఇద్దరు ఇప్పుడు సౌత్‌లో హాట్ లవ్ బర్ద్స్ గా నిలుస్తుంది. అంతేకాదు ఈ ఇద్దరు మ్యారేజ్ కూడా చేసుకునే అవకాశం ఉందని సమాచారం.
సిద్ధార్థ్, అదితి రావు హైదరీ కలిసి ఆ మధ్య `మహాసముద్రం`అనే చిత్రంలో నటించారు. `ఆర్‌ఎక్స్ 100` దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం పరాజయం చెందింది. ఇందులో శర్వానంద్, అను ఇమ్మాన్యుయెల్ కూడా నటించారు. ఈ సినిమా సమయంలోనే సిద్ధార్థ్, అదితి మధ్య ప్రేమ చిగురించిందని సమాచారం. ప్రస్తుతం అదితి `గాంధీ టాక్స్` అనే సైలెంట్ మూవీ, రెండు వెబ్ సిరీస్ లు చేస్తుంది. సిద్ధార్థ్ `ఇండియన్ 2`లో కీలక పాత్రలో నటిస్తున్నారు.
