పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరో సినిమా వాయిదా పడింది. నాగచైతన్య నటిస్తున్న సినిమా కోసం ప్రభాస్ తన సినిమాని వాయిదా వేసుకున్నారు. దీంతో ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ షాక్‌లోకి వెళ్లిపోయారు.
ప్రభాస్(Prabhas) మరో సినిమా వాయిదా పడింది. ప్రభాస్ డైరెక్ట్ బాలీవుడ్‌లో చేస్తున్న తొలి చిత్రం `ఆదిపురుష్`(Adipurush) సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. భారీ సినిమాలు ఒకే డేట్‌కి వస్తోన్న నేపథ్యంలో క్లాషెస్ లేకుండా చూసుకునేందుకు Prabhas సినిమా Adipurushని వాయిదా వేశారు. అయితే ప్రభాస్ వెనక్కి తగ్గింది నాగచైతన్య సినిమా కోసం కావడం విశేషం.
నాగచైతన్య(Naga Chaitanya) బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ `లాల్ సింగ్ చద్దా` చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్(Aamir Khan) హీరోగా నటిస్తున్న చిత్రమిది. ఇందులో నాగచైతన్య ఆర్మీ అధికారికగా కనిపించబోతున్నారు. ముఖ్యమైన పాత్ర కావడంతో చైతూ చేస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని ఆగస్ట్ 11న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేయబోతుంది యూనిట్. కొత్తగా రిలీజ్ డేట్ ప్రకటించారు. `ఆదిపురుష్` చిత్ర బృందంతో జరిగిన చర్చల అనంతరం ఆగస్ట్ 11న రాబోతున్నట్టు వెల్లడించారు.
ఈ మేరకు `లాల్ సింగ్ చద్దా` యూనిట్ ఓ నోట్‌ని పంచుకుంది. తమ సినిమా చిత్రీకరణ ఇంకా పూర్తి కాకపోవడం వల్లే ముందుగా ఏప్రిల్ 14న విడుదల చేయాలనుకునే డేట్‌న సినిమా కావడం లేదు. `ఆదిపురుష్` టీమ్ సహకారంతో ఆగస్ట్ 11న విడుదల చేయబోతున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు `ఆదిపురుష్` టీమ్‌కి, నిర్మాతలు భూషణ్ కుమార్, ఓంరౌత్ లకు ధన్యవాదాలు తెలిపారు. అమీర్ ఖాన్ `లాల్ సింగ్ చద్దా` సినిమా కోసం ఇప్పుడు `ఆదిపురుష్` వాయిదా పడింది. మరి ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే రామాయణం ఆధారంగా `ఆదిపురుష్` సినిమా రూపొందుతుండగా, ఇందులో రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, సీతగా కృతి సనన్ నటిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు ప్రభాస్ నటించిన `రాధేశ్యామ్` విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. దీంతోపాటు ప్రభాస్ `సలార్`, `ప్రాజెక్ట్ కే` చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే `స్పిరిట్` చిత్రం త్వరలోనే ప్రారంభం కాబోతుందని టాక్. మరోవైపు మారుతితోనూ ఓ సినిమా చేయబోతున్నారు ప్రభాస్. అలాగే బాలీవుడ్‌లో మరో ప్రాజెక్ట్ చేసే కమిట్ మెంట్ కూడా ఉంది.
