ఈ సినిమాలో రావణుడు గెటప్ పైనా, ఆంజనేయులు వారి డైలాగులు పైనా విమర్శలు వచ్చాయి. మినిమం రెస్పాన్స్ బులిటి లేకుండా సినిమా తీసారని అన్నారు. 


రిలీజ్ కు ముందు 'ఆదిపురుష్'కు ఓ రేంజిలో హైప్ ఏర్పడింది. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యిపోయింది. ఫస్ట్ వీకెండ్ మూడు రోజుల టాక్ ఏంటనేది బయటకొచ్చినా అంతకు ముందే చేసుకున్న అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. నిర్మాణ సంస్థ అఫీషియల్ గా ప్రకటించిన దాని ప్రకారం ఫస్ట్ వీకెంట్ లో రూ.340 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

ఇక సోమవారం నుంచి మాత్రం 'ఆదిపురుష్' కలెక్షన్స్ డ్రాప్ మొదలైంది. ఓవైపు వివాదాలు పెరుగుతుంటే.. మరోవైపు కలెక్షన్స్ పికప్ కాకపోవటం నిర్మాతలను ఆందోళనలో పడేసింది. ఆరు రోజుల్లో రూ.410 కోట్ల గ్రాస్ సాధించిన ఈ మూవీకి ఏడో రోజు ఓవరాల్ గా రూ.10 కోట్ల వరకే కలెక్షన్స్ వచ్చినట్లు చెప్తున్నారు. దీనిబట్టి ఓవరాల్ గా తొలివారంలో రూ.420 కోట్ల మేర గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 'ఆదిపురుష్' ఇక కోలుకోవడం కష‍్టమే అని ట్రేడ్ తేల్చేసింది. ఇదంతా ఓ ప్రక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమాలో రావణుడు గెటప్ పైనా, ఆంజనేయులు వారి డైలాగులు పైనా విమర్శలు వచ్చాయి. మినిమం రెస్పాన్స్ బులిటి లేకుండా సినిమా తీసారని అన్నారు. దానికి తోడు రైటర్ వచ్చి మరీ వివరణలు ఇవ్వటం, అవీ నెగిటివ్ అవటం మరింత ఆందోళనగా మారింది. ఈ క్రమంలో సోషల్ మీడియా జనం జూ.ఎన్టీఆర్ పాత వీడియో ఒకటి తీసుకొచ్చి వైరల్ చేస్తున్నారు. ఆ వీడియో మీరు ఇక్కడ చూడవచ్చు.

Scroll to load tweet…

జై లవకుశ సినిమా విడుదల సందర్భంగా జూ. ఎన్టీఆర్ రావణుడి పాత్ర వేసినప్పుడు రామాయణంతో పాటు రావణుడి గురించి ఎక్కడ సమాచారం సేకరించాడో తెలిపాడు. పౌరాణికానికి సంబంధించిని సినిమాలు చేస్తున్నప్పుడు అందులోని పాత్రల సమాచారం కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. కానీ అందులోని విషయాన్ని పాడు చేయకుంటే చాలని ఎన్టీఆర్‌ ఇలా తెలిపాడు.

'జై లవకుశ' సినిమా ప్రారంభానికి ముందే రావణుడి గురించి తెలుసుకునేందుకు.. ఆనంద్ నీలకంఠ రాసిన 'అసుర' అనే పుస్తకాన్ని చదివాను. రావణుడు 18 లోకాలకు రాజు మాత్రమే కాదు అసురుల చక్రవర్తి కూడా.. అన్ని లోకాలకు అధిపతి అయ్యాడంటే అతడికి ఎంత నేర్పు ఉండాలి. అలాంటి వ్యక్తి కళ్లు ఎలా ఉండాలి. ఇవన్నీ రావణుడిలో కనిపించాలి. అందుకే రాముడు కూడా యుద్ధం సమయంలో రావణాసురుడు చూడగానే ఇంత గొప్ప వ్యక్తివా నువ్వు అని పద్యాన్ని అందుకున్నాడు.

అలా రావణడు ఎక్కడైనా నిలబడితే శత్రువు సైతం అతడిని పొగిడేలా ఉండాలి. అలా ఆ పాత్ర చేసేటప్పుడు నేను కూడా ఎలా మాట్లాడాలి? అన్న విషయాలను తెలుసుకున్నాను.' అని చెబుతూనే ఆ పుస్తకం తనకు జై లవకుశ సినిమా కోసం సహాయపడిందని తెలిపాడు.

సినిమాలో పౌరాణికం కాదు...అందులోనూ చిన్న పాత్ర అయినా ఎన్టీఆర్ ఎంతో రీసెర్ చేసారని ఆయన మాటలని బట్టి అర్దమవుతోంది. అలాంటిది రామాయణం మీద సినిమా తీసిన రచయిత, దర్శకుడులకు ఆ మాత్రం సెన్స్ లేకుండా ఎలా మాట్లాడుతున్నారు. ఎలా తీసారు అని ప్రశ్నిస్తున్నారు.