సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో మొదటగా వినిపించే పేరు నయనతార. ఈమె ఒక సినిమాలో నటించడానికి కోట్లలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంటుంది. మూడు నుండి ఆరు కోట్ల వరకు నయనతార రెమ్యునరేషన్ తీసుకుంటుందట.

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. మధ్యలో వాణిజ్య ప్రకటనలలోనూ నటించడం మొదలుపెట్టింది. అంతగా ఈ భామ యాడ్స్ లో నటించడానికి ఎందుకు ఇంటరెస్ట్ చూపిస్తుందో తెలుసా..? ఒక్క యాడ్ ద్వారా ఆమె సంపాదించే మొత్తం అక్షరాలా రూ.3 కోట్లు. సౌత్ లో యాడ్ కోసం ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ నయనే..

టాలీవుడ్ నటి సమంత కూడా ఈ మధ్య యాడ్స్ లో కనిపిస్తోంది. ఈ భామ ఒక యాడ్ కోసం రూ.2 కోట్లు చార్జ్ చేస్తుందని తెలుస్తోంది. సినిమాలలో నటించాలంటే చాలా కష్టపడాలి. చాలా రోజులు షూటింగ్ లో పాల్గొనాలి.

కానీ వాణిజ్య ప్రకటనలు అలా కాదు. మహా అయితే రెండు రోజులు షూటింగ్ జరుగుతుంది అంతే.. దీంతో హీరోయిన్లు కూడా ప్రకటనల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కాజల్, తమన్నా ఇలా చాలా మంది యాడ్స్ తో బాగానే సంపాదిస్తున్నారు.