Asianet News TeluguAsianet News Telugu

మాంసాహారులపై అదా శర్మ కామెంట్స్ వైరల్

 తను శాఖాహారిని అనే విషయం గుర్తు చేస్తూ మాంసాహారులను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేసింది.

Adah Sharma On Argument Over Non-Vegetarian Food jsp
Author
First Published Aug 22, 2024, 1:25 PM IST | Last Updated Aug 22, 2024, 1:25 PM IST

పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అదాశర్మ తొలి సినిమాలో తన అందం, అభినయంతో కట్టిపడేసింది.  ఆ తర్వాత అడవి శేష్ తో కలసి నటించిన 'క్షణం' సినిమాతో హిట్టందుకుంది. ఆ తర్వాత కొన్ని ఆఫర్లు అందుకున్నప్పటికీ అవేమీ ఆశించిన స్థాయిలో విజయాన్నివ్వలేదు.

అయితే  ‘ది కేరళ స్టోరీ’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న అదాశర్మ  వరస పెట్టి హిందీ ప్రాజెక్టులు చేస్తోంది. కేరళ స్టోరీ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. తన సినిమాల విషయంలోనే కాకుండా అనేక కారణాల వల్ల వార్తల్లో నిలుస్తోంది ఈ హీరోయిన్. రీసెంట్ గా  పెటా ఇండియాకు చేసిన యాడ్ క్యాంపైన్ లో భాగంగా  మీడియాతో ఆమె ఇంటరాక్ట్ అవుతూ తను శాఖాహారిని అనే విషయం గుర్తు చేస్తూ మాంసాహారులను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేసింది.

అదాశర్మ చిన్నప్పటినుంచి శాఖాహారి. ఆమె తరుచుగా తన అభిమానులను మాంసం తినవద్దని రిక్వెస్ట్ చేస్తూంటుంది. అయితే ఆమెకు మానవుడు ప్రారంభం రోజుల్లో వేటాడుతూ మాంసాహారి అని చెప్తూ ఫుడ్ చెయిన్ ని గుర్తు చేస్తూ అలాంటి వాళ్ళు ఇప్పుడు మాంసం మానేసి నాన్ వెజిటేరియన్ గా ఉండాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. 

దానికి అదా శర్మ సమాధానమిస్తూ... మీరు చెప్పింది వంద శాతం నిజం. అయితే మీరు ఆ స్టోన్ ఏజ్  రోజుల్లో ఉండి గుహల్లో నివసిస్తూ, అప్పటి ఆయుధాలతో తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా వేడాతుతూ మీ ఇష్టం వచ్చిన జంతువును వేడాడి తినచ్చు.  దాన్ని పచ్చిగానో లేక కాల్చుకునో తినచ్చు. అయితే ఇప్పుడు కూడా మాంసం తినాలంటే ఆ నాటి కాలం లోగా గుహల్లో ఉంటూ వేటాడుతూ తినండి. అంతేకానీ ఏసీ కారుల్లో, ఏసీ రెస్టారెంట్ లలో  కూర్చుని చక్కగా జంతువుని కోసి, చర్మం తీసేసి , రోస్ట్ చేసి , ప్లేట్ లలో పెట్టుకుని తినకూడదు అని చెప్పుకొచ్చింది. అదా శర్మ అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios