యంగ్ బ్యూటీ అదా శర్మ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన హార్ట్ ఎటాక్ లో నితిన్ సరసన హీరోయిన్ గా నటించింది. ఆ చిత్రంలో అదా గ్లామర్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత అదా శర్మ కొన్ని చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. మరికొన్ని చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ రోల్స్ కి మాత్రమే పరిమితం అయింది. 

కమర్షియల్ చిత్రాల్లో అవకాశాల హీరోయిన్లు గ్లామర్ ఫీట్లు చేయడం సహజమే. సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంటారు. అలా గ్లామర్ ఒలకబోయడంలో అదా శర్మ హద్దులు దాటేసింది. తాజాగా అదా శర్మ షేర్ చేసిన బికినీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

అదా శర్మ బికినీ ఫోజులు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అవకాశాల కోసమే అదా రెచ్చిపోతోందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, క్షణం, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల్లో అదా నటించింది. ఇటీవల కల్కి చిత్రంలో కూడా అదా నటించింది.