తరుచూ వివాదాలతో వార్తల్లో ఉండే స్టార్ వారసురాలు వనితా విజయ్‌ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె మరోసారి పెళ్లికి సిద్ధమవ్వటం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. సీనియర్‌ నటుడు విజయ్‌ కుమార్‌, ఒకప్పటి టాప్ హీరోయిన్‌ మంజులల పెద్ద కూతురు వనిత. ఈ మె 1995లో రిలీజ్‌ తమిళ్ లో తెరకెక్కిన చంద్రలేక సినిమాతో విజయ్‌కు జోడి వెండితెరకు  పరిచయం అయ్యింది. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించిన ఈమె 2000 సంవత్సరంలో నటుడు ఆకాష్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఒక కూతురు, కొడుకు పుట్టిన తరువాత అభిప్రాయ బేధాలతో 2005లో వీరు విడాకులు తీసుకున్నారు.

తరువాత రెండేళ్లకు 2007లో ఆనంద్‌ జయదర్షన్‌ అనే బిజినెస్‌మెన్‌ను వివాహం చేసుకుంది, వీరికి ఓ కూతురు పుట్టింది. ఆ తరువాత ఆయన నుంచి కూడా విడాకులు తీసుకుంది వనిత. తాజా ఈ సీనియర్‌ నటి మూడో పెళ్లికి రెడీ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. కొంత కలంగా కొరియోగ్రాఫర్‌ రాబర్డ్‌ తో వనిత సహజీవనం చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా విజువల్‌ ఎఫెక్ట్స్‌ డైరెక్టర్‌ పీటర్‌ పాల్‌ను ఆమె వివాహం చేసుకోబోతుందని తెలుస్తోంది.

ఇటీవల తమిళ బిగ్‌బాస్ 3 లో పాల్గొని వార్తల్లో నిలిచిన వనిత ఇప్పుడు మూడో పెళ్లి వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. అధికారికంగా ప్రకటించకపోయినా ఈ నెల 27న చెన్నూలోని తన ఇంట్లోని వివాహం జరగనున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఓ వివాహ పత్రిక కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.