బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిన నటి శ్రీవాణి తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

17 ఏళ్ల వయసులోనే ప్రేమించిన వాడితో లేచిపోయినట్లు చెప్పి షాక్ ఇచ్చింది శ్రీవాణి. అయితే చిన్నగా ఉన్నానని పెళ్లికి అడ్డు చెప్పారని, సెప్టెంబర్ 2కి 18 ఏళ్లు పూర్తి కావడంతో సెప్టెంబర్ 15న పెళ్లి చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఆ సమయంలోనే సీరియల్స్ చేస్తున్నట్లు, పెళ్లి చేసుకోవాలని బయటకి వెళ్లిన తరువాత 45 రోజులు బయటే ఉన్నామని చెప్పుకొచ్చింది.

తమ దగ్గర డబ్బులు ఉండడంతో ఇబ్బంది పడలేదని తెలిపింది. మొదట షిరిడి వెళ్తున్నామని చెప్పి ఆయన అమలాపురం తీసుకువెళ్లారని, నాకు తెలిస్తే అందరికీ చెప్పేస్తానని ఆయన చెప్పలేదని తెలిపింది. అమలాపురంలోనే 45 రోజులు గడిపినట్లు, బాగా ఎంజాయ్ చేశామని చెప్పుకొచ్చింది. విక్రమ్ అనేవాడు బయటవ్యక్తి కాదని, చిన్నప్పటి నుండి తెలుసనీ, అందుకే బయట వ్యక్తితో వెళ్తున్నాననే ఫీలింగ్ రాలేదని చెప్పుకొచ్చింది.

తన ఫ్యామిలీ కూడా బాగా తెలుసునని, ఆ ధైర్యంతోనే వెళ్లినట్లు తెలిపింది. అతనితో వెళ్తున్నా అంటే లేచిపోతున్నా అని తెలియదని, వెళ్దామా అంటే ఓకే చెప్పేసా అంటూ టీనేజ్ లో తన ప్రేమకథ గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అంతా సజావుగా సాగుతుందని, సంతోషంగా ఉన్నానని అన్నారు.