Asianet News TeluguAsianet News Telugu

స్నేహా ఉల్లాల్...ఏడేళ్ల తర్వాత మళ్లీ,ఇన్నాళ్లూ ఏమైంది?

ఇన్నాళ్లూ ఏమైపోయారని చాలామంది అభిమానులు నన్ను అడిగేవారు. అయితే దీనికంతటికీ కారణం నాకున్న ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్లనే! రక్తానికి సంబంధించిన అనారోగ్యమిది. ఇది నా రోగనిరోధక శక్తిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. 

Actress Sneha Ullal signs Sapthagiri s  Eight film
Author
Hyderabad, First Published Oct 7, 2021, 7:20 AM IST

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది తార స్నేహా ఉల్లాల్. ఆ త‌ర్వాత మంచు మనోజ్ తో  క‌రెంట్‌, బాలయ్య  సింహా వంటి చిత్రాల‌ు చేసింది. అలాగే హిందీ సినిమాలు చేసింది.  అయితే అప్పట్లో ఉన్నట్లుండి కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరమైంది. దీనికంతటికీ కారణం ఆఫర్స్ రాక కాదు.. తనకున్న సుదీర్ఘ అనారోగ్యం కారణంగానే అంటూ చెప్పింది స్నేహ. ఈ బ్యూటీ తెలుగు సినిమాలో క‌నిపించ‌క ఏడేళ్ల‌కు పైగానే అవుతుంది. సుదీర్ఘ విరామం త‌ర్వాత మ‌ళ్లీ ఇక్క‌డి ప్రేక్ష‌కుల ముందుకొచ్చేందుకు సిద్ద‌మైంది స్నేహాఉల్లాల్‌.

గ్యాప్ గురించి చెప్తూ...ఇన్నాళ్లూ ఏమైపోయారని చాలామంది అభిమానులు నన్ను అడిగేవారు. అయితే దీనికంతటికీ కారణం నాకున్న ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్లనే! రక్తానికి సంబంధించిన అనారోగ్యమిది. ఇది నా రోగనిరోధక శక్తిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. 

Also Read సమంత, అనుష్కపై మనసులో మాట బయటపెట్టిన క్రేజీ బ్యూటీ.. ఆ ముగ్గురు హీరోలంటే..

స్నేహాఉల్లాల్‌ ప్రస్తుతం ఎయిట్ అనే సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇస్తోంది. స‌ప్త‌గిరి హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో న‌టిస్తున్న ఈ చిత్రంలో స్నేహా ఉల్లాల్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. స్నేహాఉల్లాల్ ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్. బ్లాక్ డ్రెస్ లో సీరియ‌స్ లుక్ లో క‌నిపిస్తోంది స్నేహాఉల్లాల్‌.

చిత్రం విషయానికి వస్తే....కమిడియన్  నుంచి హీరోగా మారిన సప్తగిరి హీరోగా ‘ఎయిట్’ అనే సినిమా చేస్తున్నారు. బహుభాషా చిత్రంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ త్రం రూపొందుతోంది. రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సూర్యాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది.  

Also Read బికినీ వేసుకున్నా, విడాకులు ఎప్పుడని అడుగుతున్నారు, మీ విషపూరిత ఆలోచనలు మార్చలేను...నటి విద్యుల్లేఖ ఫైర్

ఇల్యూజన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కామెడీకి కూడా పెద్ద పీట వేశామని.. సప్తగిరి ఇమేజ్‌కు తగ్గట్టుగానే సినిమా ఉంటుందని ఇప్పటికే నిర్మాత రిజ్వాన్ వెల్లడించారు. ఎన్‌.ఎస్‌. ప్రసు సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి న‌జీర్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, వంశీ ఎడిట‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. కాగా, హాస్యనటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సప్తగిరి హీరోగా మారి ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’, ‘సప్తగిరి ఎల్ఎల్‌బి’, ‘వజ్రకవచధర గోవింద’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, ఈ సినిమాలతో  హీరో గా హిట్ కొట్టలేకపోయారు సప్తగిరి. ఇప్పుడు ఈ ‘ఎయిట్’తో తన హీరో గా ఫామ్ లోకి వస్తామని చెప్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios