MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బికినీ వేసుకున్నా, విడాకులు ఎప్పుడని అడుగుతున్నారు, మీ విషపూరిత ఆలోచనలు మార్చలేను...నటి విద్యుల్లేఖ ఫైర్

బికినీ వేసుకున్నా, విడాకులు ఎప్పుడని అడుగుతున్నారు, మీ విషపూరిత ఆలోచనలు మార్చలేను...నటి విద్యుల్లేఖ ఫైర్

సోషల్ మీడియా ట్రోలింగ్ కి సెలెబ్రిటీలు ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారో చెప్పడానికి ఇదొక నిదర్శనం. వెకేషన్ లో బికినీ ధరించిన లేడీ కమెడియన్ విద్యుల్లేఖపై నెటిజెన్స్ అనుచిత కామెంట్స్ చేసి, ఆమెను మానసిక వేదనకు గురిచేశారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 06 2021, 12:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

తెలుగు, తమిళ భాషలలో ఫేమస్ లేడీ కమెడియన్స్ లో ఒకరైన Vidyulekha Raman ఎల్లో స్విమ్ సూట్ ధరించిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. బీచ్ వెకేషన్ సందర్భంగా ఆమె స్విమ్ సూట్ ధరించడం జరిగింది. ఆ ఫోటోకు 'ఏడాదిలో రెండు సార్లు ఆరు నెలల వెకేషన్ కావాలని',అంటూ విద్యుల్లేఖ కామెంట్ పెట్టారు.

25

ఈ ఫోటో కాస్త వైరల్ గా మారడంతో నెటిజెన్స్ నెగిటివ్ కామెంట్స్ తో విద్యుల్లేఖపై సోషల్ మీడియా దాడికి దిగారు. ఓ నెటిజెన్ ఏకంగా.. 'మీరు విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నారు?' అని కామెంట్ పెట్టారట. చీఫ్ కామెంట్స్ తో విసిగిపోయిన విద్యుల్లేఖ సోషల్ మీడియా వేదికగా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఆమె తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో సుదీర్ఘ సందేశం పోస్ట్ చేశారు. 

35


బికినీ వేసుకున్నందుకు విడాకులు ఎప్పుడని అడుగుతున్నారంటే, మీరు 1920 ఆంటీ, అంకుల్స్ లా ఆలోచిస్తున్నారు. ఇది 2021 ఈ కాలానికి రండి. ఓ అమ్మాయి వస్త్రధారణే విడాకులకు కారణం అయితే, సాంప్రదాయంగా బట్టలు ధరించే ఆడవాళ్ళ కాపురాలు చాలా ఆనందంగా ఉండాలి. మీరు నన్ను కామెంట్ చేసినందుకు కాదు, అసలు సమాజపు ఆలోచనా ధోరణి ఈ స్థాయిలో దిగజారుడుగా ఉందని, భాధ వేస్తుంది. 

45

నన్ను అర్థం చేసుకునే భర్త దొరికాడు, అనేక ఉన్నత ఆలోచనలు, భావాలు నాతో పంచుకుంటాడు. అసలు ఈ విషయంపై స్పందిచవద్దని ఆయన అన్నారు. కానీ నేను మాట్లాడకుండా ఉండలేకపోయాను.మీ విషపూరిత, సంకుచిత ఆలోచన ధోరణిని నేను మార్చలేకపోవచ్చు.  మీరు బ్రతకండి, ఇతరులను బ్రతకనివ్వండి... అంటూ ఆమె తన ఆవేదన వ్యక్తం చేశారు. 

55


గతంలో కూడా ఆరోగ్యం కోసం సన్నబడిన విద్యుల్లేఖపై ఇలాగే నెగిటివ్ కామెంట్స్ చేశారు. హీరోయిన్ కావాలని అనుకుంటున్నావా అంటూ ఎగతాళి చేశారు. కాగా 2020 సెప్టెంబర్ 9న ఫిట్నెస్ ట్రైనర్ సంజయ్ ని విద్యుల్లేఖ ప్రేమ వివాహం చేసుకున్నారు. విద్యుల్లేఖ నటుడు మోహన్ రామన్ కుమార్తె అన్న విషయం తెలిసిందే. 

 

Also read క్యాబ్ డ్రైవర్ వేధించాడు... డ్రగ్స్ ఆరోపణల అనంతరం మరోసారి వార్తలకెక్కిన హీరోయిన్ సంజనా గల్రాని

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
లక్షల జీతం వచ్చే ఐటీ జాబ్ వదిలేసి.. 100 కోట్ల హీరో అయ్యాడు.. ఇంట్లో అబద్దం చెప్పి ఇండస్ట్రీకి వచ్చిన యంగ్ స్టర్ ఎవరో తెలుసా?
Recommended image2
Ram Charan: రాంచరణ్ కోసం చివరికి ఆ పని కూడా చేసిన స్టార్ హీరో.. చిరంజీవి ఫస్ట్ తిట్టేది ఆయన్నే
Recommended image3
Bigg Boss 10 Mangli : బిగ్ బాస్ తెలుగు10 లోకి మంగ్లీ ఎంట్రీ? రెమ్యునరేషన్ ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved