ఆస్కార్ అవార్డ్స్ 2022  వేడుకలో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్.. యాంకర్, కమెడియన్ క్రిస్ రాక్ ని చెంపదెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై నటి సమీరా రెడ్డి స్పందిస్తూ.. స్మిత్ భార్యకు వచ్చిన వ్యాధితోనే తనూ బాధపడుతున్నట్టు తెలిపింది.    

గత నెల మార్చి 27న గ్రాండ్ గా నిర్వహించిన ఆస్కార్ అవార్డ్స్ 2022 (Oscar Awards 2022) లో హాలీవుడ్ స్టార్, యాక్టర్ విల్ స్మిత్ (Will Smith) బెస్ట్ యాక్టర్ అవార్డు పొందిన విషయం తెలిసిందే. అదే రోజు విల్ స్మిత్ వేదికపై హాస్యనటుడు క్రిస్ రాక్ ను చెంప దెబ్బ కొట్టిన ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే విల్ స్మిత్ భార్య జాడా పింకెట్ స్మిత్ జుట్టు రాలడం అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలియకుండా విల్ భార్య జాడా బట్టతల లుక్ గురించి చమత్కరకంగా మాట్లాడాడు క్రిస్ రాక్‌. మనస్థాపానికి గురైన విల్ స్మిత్ ఈవెంట్ మధ్యలో అతని చెంప పగలగొట్టాడు. 

ఈ ఘటనతో వైదికపై కొంత ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విల్ స్మిత్ అభిమానులంతా ఈ సంఘటన గురించే చర్చించుకుంటున్నారు. అయితే ఈ ఘటనతో మనస్తాపానికి గురైన విల్ స్మిత్ అకాడమీకి రాజీనామా చేసిన విషయం కూడా తెలింది. అయితే విల్ స్మిత్ భార్య పింకెట్ స్మిత్ కు వచ్చిన వ్యాధిపై నటి సమీరా రెడ్డి (Sameera Reddy) ఇటీవల స్పందించింది. జాడా పింకెట్ కు వచ్చిన వ్యాధిని వివరిస్తూ.. తాను ఆ డిసీస్ తో బాధపడ్డానంటూ ఓ సుధీర్ఘమైన నోట్ రాసుకొచ్చింది.

నోట్ లో.. ‘ప్రస్తుతం ఆస్కార్ వివాదం మనందరికీ తెలిసిందే. అయితే వ్యక్తిగతంగా ప్రతిఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల పోరాటం చేస్తూనే ఉన్నారు. అనారోగ్యాల నుంచి విముక్తి పొందేందుకు సానుకూల పరిస్థితులను సృష్టించుకోవాల్సిన అవసరం ఉంది. అసలు అలోపేసియా ఏరియాటా అంటే.. ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధి. మీకు అలోపేసియా ఏరియాటా ఉన్నప్పుడు, మీ రోగనిరోధక వ్యవస్థలోని కణాలు మీ జుట్టు కుదుళ్లను చుట్టుముట్టి దాడి చేస్తాయి. 

దీంతో అటాచ్ చేసిన జుట్టు రాలిపోతుంది, ఫలితంగా బట్టతల, మచ్చలు ఏర్పడతాయి. 2016లో ఇదే వ్యాధి సంబంధించిన లక్షణాలను అక్షయ్ నా తల వెనుక 2-అంగుళాల బట్టతల మచ్చ ఉందని గుర్తించాడు. అది చూసినప్పుడు నాకు అలోపేసియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఒక నెలలో నేను మరో రెండు ప్యాచ్‌లను గుర్తించాను. దీన్ని ఎదుర్కోవడం నిజంగా కష్టమైంది. అలోపేసియా అరేటా ప్రజలను అనారోగ్యానికి గురి చేయదు కానీ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తోంది’ అంటూ రాసుకొచ్చింది.

View post on Instagram

అలాగే ప్రస్తుతం ఎలాంటి ప్యాచ్‌లు లేకుండా హెల్తీ హెయిర్‌తో ఉంది నటి సమీరా రెడ్డి. కానీ ఈ వ్యాధి తన లైఫ్ లో ఏ సమయంలోనైనా పుంజుకుంటుందనే విషయం తనకు తెలుసునని సమీరా వెల్లడించింది. అందుకే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసేందుకు హోమియోపతి ట్రీట్ మెంట్ పొందుతున్నట్టు తెలిపింది. అయితే ప్రపంచ ప్రతి ఒక్కరూ మరొకరి పట్ల కాస్తా ఆలోచించి ప్రవర్తించాలని, సున్నితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొంది. సమీరా రెడ్డి చివరిగా తెలుగు ‘క్రుష్ణం వందే జగ్దురుమ్’చిత్రంలో నటించింది. 2013లో అక్షయ్ వర్దేతో వివాహం తర్వాత నటనకు స్వస్తి చెప్పింది.