Asianet News TeluguAsianet News Telugu

నాగచైతన్య - చందూ మొండేటి సినిమాలో సాయి పల్లవి.. కన్ఫమ్ చేసిన లేడీ పవర్ స్టార్.. ఇంట్రెస్టింగ్ నోట్

నాగచైతన్య 23వ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi)  హీరోయిన్ గా కన్ఫమ్ అయ్యారు. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా అభిమానుల కోసం ప్రత్యేక ట్వీట్ చేశారు. 
 

Actress Sai Pallavi confirmed as NC23 Heroine NSK
Author
First Published Sep 20, 2023, 6:32 PM IST

లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. నేచురల్ బ్యూటీగా ఆడియెన్స్ లో ముద్రవేసుకున్న టాలీవుడ్ లో గుర్తుండిపోయే సినిమాలు చేశారు. ‘ఫిదా’ తో ఎంట్రీ ఫిదా చేసిన సాయి పల్లవి.. ఆ తర్వాత ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’, ‘పడి పడి లేచే మనసు’, ‘లవ్ స్టోరీ’, ‘శ్యామ్ సింగరాయ్’, చివరిగా ‘విరాట పర్వం’ తో అలరించింది. గ్లామర్ రోల్స్ లో కాకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. సెపరేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకుంది.

ఇక ఏడాది నుంచి సాయి పల్లవి నుంచి ఎలాంటి ప్రాజెక్ట్ అనౌన్స్ కాలేదు. ఏ హీరో సరసన నటిస్తుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అదిరిపోయే న్యూస్ చెప్పంది సాయిపల్లవి. మరోసారి క్రేజీ కాంబోను రిపీట్ చేస్తూ.. నాగచైతన్య సరసన నటించబోతున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే వీరి జోడీలో ‘లవ్ స్టోరీ’ చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. ఇక మరోసారి చైతూ, సాయిపల్లవి వెండితెరపై అలరించబోతున్నారు. 

నాగచైతన్య - చందూ మొండేటి సినిమాను ఎప్పుడో ప్రకటించారు. కానీ హీరోయిన్ విషయంలో సస్పెన్స్ క్రియేట్ చేశారు. వీడియో ద్వారా అందించిన నిన్నటి అప్డేట్ లోనూ సాయి పల్లవి అని కన్ఫమ్ చేయలేదు. తాజాగా నేచురల్ బ్యూటీనే NC23 ప్రాజెక్ట్స్ లో వర్క్ చేస్తున్నట్టు ప్రకటించింది.  ఈ టీమ్ తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. చైతన్యతో కలిసి మరో స్పెషల్ ఫిల్మ్ చేయడం సంతోషంగా ఉందని తెలిపింది. నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులను చాలా మిస్ అయ్యాను. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ తో త్వరలోనే కలుస్తాను.. అంటూ చెప్పుకొచ్చింది. 

NC23 వర్క్ టైటిల్ తో సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ‘కార్తీకేయ 2’ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో ట్రూ ఇన్సిడెంట్స్ ఆధారంగా చిత్రం రూపుదిద్దుకోనుంది. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios