అమెరికా సెక్స్ రాకెట్: రెజీనా ఏం చెప్పిందంటే..

actress regina comments on america sex racket
Highlights

అమెరికా సెక్స్ రాకెట్ విషయంలో హీరో రెజీనా పేరుని పరోక్షంగా ప్రస్తావిస్తున్నారు. ఈ విషయం ఆమె వరకు వెళ్లడంతో కాస్త ఘాటుగానే స్పందించింది ఈ బ్యూటీ. తనపై వస్తున్న వార్తలన్నీ రూమర్లేనని.. నిజాలు తెలుసుకొని మాట్లాడితే బెటర్ అంటూ అసహనాన్ని వ్యక్తం చేసింది.

అమెరికా సెక్స్ రాకెట్ విషయంలో హీరోయిన్ రెజీనా పేరుని పరోక్షంగా ప్రస్తావిస్తున్నారు. ఈ విషయం ఆమె వరకు వెళ్లడంతో కాస్త ఘాటుగానే స్పందించింది ఈ బ్యూటీ. తనపై వస్తున్న వార్తలన్నీ రూమర్లేనని.. నిజాలు తెలుసుకొని మాట్లాడితే బెటర్ అంటూ అసహనాన్ని వ్యక్తం చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ విషయాలపై స్పందించడం తనకు ఇష్టం లేదని అంటూనే కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది.

'అమెరికా సెక్స్ రాకెట్ తో నాకు సంబంధం లేకుండానే ఏదేదో ప్రచారం చేస్తున్నారు. నిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడేప్పుడు అందులో వాస్తవం ఏంటో తెలుసుకొని బాధ్యతగా వ్యవహరించాలి. మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే దేని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏ పరిశ్రమలో అయినా సమస్యలు ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ ఒక్కటే చెడ్డది అనడం సరికాదు. కార్పోరేట్ కంపనీలలో కూడా సమస్యలు ఉంటాయి. కానీ మేము కెమెరా ముందు ఉంటాం కాబట్టి తొందరగా టార్గెట్ అవుతున్నాం.

ఇలాంటి వివాదాల గురించి మాట్లాడకపోవడమే మంచిది. మాట్లాడితే మళ్లీ నన్నే కార్నర్ చేస్తారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాల గురించి మాట్లాడతాను. అందరూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాను' అంటూ చెప్పుకొచ్చింది. కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ కు చెందిన తారలను అమెరికా తీసుకొని వెళ్లి అక్కడ వారితో వ్యభిచారం చేయిస్తున్నారనే కేసులో కిషన్, అతడి భార్య చంద్రకళను పోలీసులు అదుపులో తీసుకున్నారు. అలా వ్యభిచారం చేస్తోన్న తారలు వీళ్లే అంటూ ఓ లిస్టు బయటకు వచ్చింది. అందులో రెజీనా పేరు కూడా ఉందనే ఆరోపణలు రావడంతో ఆమె ఈ విధంగా స్పందించింది. 

loader