Asianet News TeluguAsianet News Telugu

బస్సుని ఛేజ్ చేసి మరీ విద్యార్థులపై దాడి చేసిన నటి.. డ్రైవర్, కండక్టర్ తో కూడా గొడవ

ప్రముఖ కోలీవుడ్ నటి రంజనా నాచ్చియార్ వివాదంలో చిక్కుకున్నారు. ఏకంగా విద్యార్థులపై దాడి చేసిన ఘటనలో ఆమె అరెస్ట్ అయ్యారు. రంజనా నాచ్చియార్ తమిళంలో కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ తో గుర్తింపు పొందారు.

Actress ranjana nachiyar  attack on college students dtr
Author
First Published Nov 5, 2023, 12:04 PM IST

ప్రముఖ కోలీవుడ్ నటి రంజనా నాచ్చియార్ వివాదంలో చిక్కుకున్నారు. ఏకంగా విద్యార్థులపై దాడి చేసిన ఘటనలో ఆమె అరెస్ట్ అయ్యారు. రంజనా నాచ్చియార్ తమిళంలో కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ తో గుర్తింపు పొందారు. విద్యార్థులపై దాడి చేసిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో స్కూల్ విద్యార్థులు, కళాశాల విద్యార్థులు బస్సులో ఫుట్ బోర్డుపై ప్రయాణించడం ఒక స్టైల్ గా మారిపోయింది. దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చెన్నైలో పోరూర్ నుంచి కుండ్రట్టూరు వైపుగా వెళుతున్న తమిళనాడు రవాణా సంస్థ బస్సులో విద్యార్థులు ఫుట్ బోర్డుపై వేలాడుతూ కనిపించారు. 

రంజనా నటి మాత్రమే కాదు బిజెపి మహిళా నేతగా కూడా యాక్టివ్ గా ఉన్నారు. విద్యార్థులని గమనించిన ఆమె బస్సుని ఛేజ్ చేసి ఆపింది. ఫుట్ బోర్డుపై ఉన్న విద్యార్థుల చెంపపై కొడుతూ దాడి చేసింది. వారితో వాగ్వాదానికి దిగింది. అంతే కాదు కండక్టర్, డ్రైవర్ తో కూడా గొడవ పెట్టుకుంది. విద్యార్థులని ఫుట్ బోర్డుపై ఎలా అనుమతిస్తారు అని వారితో రచ్చ రచ్చ చేసింది. 

ఈ వ్యవహారం కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. విద్యార్థులపై చేయి చేసుకోవడం, కండక్టర్, డ్రైవర్ తో గొడవకి దిగడం లాంటి సంఘటనతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఫుట్ బోర్డుపై ప్రయాణిస్తున్న విద్యార్థులని మందలించడం మంచి పనే. కానీ చేయి చేసుకోవడం ఏంటి ? డ్రైవర్, కండక్టర్ తో గొడవకి దిగడం ఏంటి ? అంటూ విమర్శలు ఎదురయ్యాయి. 

అయితే అరెస్ట్ అయిన సాయంత్రానికే ఆమెకి బెయిల్ లభించినట్లు తెలుస్తోంది. రంజనా చేసింది మంచి పనే అని.. ఫుట్ బోర్డుపై ప్రయాణించడం సురక్షితం కాదని అంటున్నారు. మరికొందరు మాత్రం ఆమె పబ్లిసిటీ కోసం ఇలా చేసింది అని అంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios