బాలీవుడ్ లో 'మీటూ' ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. టాలీవుడ్ లో చిన్మయి లాంటి వాళ్లు కూడా ఈ ఉద్యమంపై స్పందిస్తున్నారు. ఓ పక్క ఈ ఉద్యమం సాగుతుంటే మహిళలపై వేధింపులు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే పలువురు వివిధ రంగాల్లో తాము ఎదుర్కొంటున్న వేధింపుల గురించి బయటపెడుతున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అయినప్పటికీ మహిళలపై అఘాయిత్యాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సినీ రంగంలో ఈ వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. తాజాగా సీనియర్ నటి రాణి తాను ఎదుర్కొంటున్న వేధింపుల గురించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది.

తమిళంలో ఓ సీరియల్ చిత్రీకరణ సమయంలో సహ నటుడు షణ్ముగరాజన్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని సెంగుడ్రం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తెలుగు, కన్నడ భాషల్లో దాదాపు 32 సినిమాలలో ఆమె నటించారు. 'నచ్చావులే' సినిమాలో హీరో తల్లి పాత్ర పోషించి ఉత్తమ సహాయనటి కేటగిరీలో నంది అవార్డు దక్కించుకుంది!