Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ హీరోయిన్ నిశ్చితార్థం ?.. పిక్ వైరల్, వరుడు ఎవరు అంటూ నెటిజన్ల ఆరా..

తమిళంలో పలు చిత్రాల్లో నటించింది కార్తీక. రంగం చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో కార్తీక నాగ చైతన్య జోష్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.

Actress Radha daughter karthika nair engagement with mystery man here is details
Author
First Published Oct 20, 2023, 9:18 PM IST

సీనియర్ హీరోయిన్ రాధ గురించి పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి సరసన అత్యధిక చిత్రాల్లో నటించిన రాధ గ్లామర్ హీరోయిన్ గా, స్టార్ బ్యూటీగా వెలుగు వెలిగింది. 80,90 దశకాల్లో రాధ అనేక చిత్రాల్లో నటించింది. అయితే రాధ కుమార్తె కార్తీక నైర్ కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచయమే. 

తమిళంలో పలు చిత్రాల్లో నటించింది కార్తీక. రంగం చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో కార్తీక నాగ చైతన్య జోష్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దమ్ము చిత్రంలో కూడా నటించి మెప్పించింది. ఆ తర్వాత కార్తీకకి సరైన అవకాశాలు రాలేదు. 

ఇటీవల కార్తీక సినిమాల పరంగా అంత యాక్టివ్ గా లేదు. అయితే సడెన్ గా కార్తీక నైర్ ఎంగేజ్మెంట్ పూర్తయింది అంటూ తమిళనాట వార్తలు వస్తున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే కార్తీక ఇంస్టాగ్రామ్లో క్రేజీ పోస్ట్ పెట్టింది. కార్తీక ఓ వ్యక్తిని హగ్ చేసుకుని ఉన్న పిక్ ని ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ పిక్ లో తన వేలికి ఉన్న రింగ్ హైలైట్ అయ్యేలా ఫోజు ఇచ్చింది. దాని అర్థం కార్తీక నిశ్చితార్థం చేసుకుంది అనే అని నెటిజన్లు భావిస్తున్నారు. 

వరుడి ఎవరు అంటూ నెటిజన్లు ఆరా తీయడం ప్రారంభించారు. అయితే కార్తీక ఎంగేజ్మెంట్ గురించి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు కార్తీక నిశ్చితార్థం పూర్తయింది అని.. ఆమె వివాహం కూడా త్వరలోనే జరగనుంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. 

అవకాశాలు సన్నగిల్లడంతోనే కార్తీక నైర్ వివాహం చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇది ప్రేమ వివాహమా పెద్దలు కుదిర్చిన వివాహమా అనేది క్లారిటీ లేదు. ఆమె నిశ్చితార్థం గురించి అధికారిక ప్రకటన, పెళ్లి తేదీ లాంటి వివరాలు త్వరలోనే వెలువడనున్నట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios