మీటూ’ సినీ పరిశ్రమలో కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనిపై ఇప్పుటికే చాలా సిని సెలబ్రెటీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ‘మీటూ’అంటూ తమ అనుభవాలను బయిటపెట్టారు. అవి వారి కెరీర్ లపై, వ్యక్తిగత జీవితాలపై  తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజాగా ప్రియమణి సైతం  ‘మీటూ’పై మాట్లాడారు. 

ప్రియమణి మాట్లాడుతూ...‘‘చాలా మంది స్త్రీలు బయటకు వచ్చి తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను ధైర్యంగా పంచుకుంటున్నారు. అలానే మిగతా స్త్రీలు కూడా ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడాలి. ఇలా ప్రతి ఒక్కరూ గొంతు విప్పి మాట్లాడగలిగితే ఇలాంటి విషయాల మీద మిగతావారిలో అవగాహన తీసుకురావచ్చు. పని ప్రదేశాల్లో సురక్షిత వాతావరణాన్ని నెలకొల్పొచ్చు. 

ప్రస్తుతం నడుసున్న ‘మీటూ’ ఉద్యమం చాలా నిజమైనది. ఇలాంటి ఉద్యమాలే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలకు అద్దం పడుతుంటాయి. అలాగే ‘మీటూ’లాంటి మంచి కార్యక్రమాన్ని కొందరు తప్పుగా ఉపయోగించుకుంటున్నారు. మీటూ అనేది ఓ జెన్యూన్‌ ప్లాట్‌ఫారమ్‌. పబ్లిసిటీ కోసం దీనిని ఉపయోగించుకుంటున్నారు’’అని పేర్కొన్నారామె.  

అయితే ఇప్పుడు ప్రియమణి ...పబ్లిసిటీ కోసం మీటూని వాడద్దని చెప్పటం మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఏ సెలబ్రెటీని ఉద్దేశించి ఆమె అన్నారు... రీసెంట్ గా మీటూ అంటూ వార్తల్లో నిలిచిన సినిమా హీరోయిన్స్  గురించేనా అనేది డిస్కస్ చేస్తున్నారు. 

ఇక ప్రియమణి కెరీర్ విషయానికి వస్తే...ప్రియమణి ప్రస్తుతం..తెలుగు టీవీ కార్యక్రమాలలో  కనిపిస్తున్నారు కానీ తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు.  చక్కటి బాడీ లాంగ్వేజ్‌తో, స్మైల్, యాక్టింగ్‌ టాలెంట్‌తో టీవీ పోగ్రామ్ లను రక్తి కట్టిస్తున్నారు.  తమిళ, తెలుగు, కన్నడ సినిమాలను చేసి గ్యాప్ ఇచ్చిన ఆమె ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’లో షారుక్‌ ఖాన్‌తో ఐటమ్‌ సాంగ్‌ చేసారు.

ఆ తర్వాత 2016లో విడుదలైన ‘మన ఊరి రామాయణం’చేసారు. ఆ తర్వాత ఆమె వేరే తెలుగు చిత్రంలో నటించలేదు. ఇప్పుడు ‘సిరివెన్నెల’ అనే తెలుగు చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.ప్రకాష్‌ పులిజాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రకథ బాగా నచ్చడంతో పాటు నటనకి ఆస్కారం ఉన్న పాత్ర కావడంతో నటించేందుకు ఒప్పుకున్నారట. త్వరలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.