అసలు తెరపై ప్రగతి ను చూసిన వాళ్లు ఈ హాట్ డాన్స్ వీడియోలో చూస్తే ఆశ్చర్యపోతారు. అ స్దాయిలో తన ప్రతిభను చూపిస్తోంది. తెలుగు పరిశ్రమలో తల్లి పాత్రలు, అత్త పాత్రలతో బాగా పాపులర్ అయిన నటి ప్రగతి. క్యారక్టర్ ఏదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేయటం, జీవించడం ప్రగతికి ఉన్న మేజర్ ప్లస్ పాయింట్. అందుకే ఆమె ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన నటనతో అందరినీ మెప్పించిన ప్రగతి..లాక్ డౌన్ టైమ్ లో తనలోని మాస్ యాంగిల్ ని మన ముందుంచుతోంది.

కరోనా సమస్యతో షూటింగ్స్ అన్నీ నిలిచిపోవడంతో ఇంటికే పరిమితమైన ప్రగతి.. లాక్‌డౌన్ పీరియడ్‌ని తమకు తోచిన విధంగా ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటో, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం  ఓ తీన్మార్ సాంగ్‌కి స్టేప్పేసి ఇంటర్నెట్‌ని షేక్ చేశారు. తమిళ స్టార్ హీరో విజయ్ ఇళయదళపతి నటిస్తున్న అప్‌కమింగ్ మూవీ మాస్టర్ చిత్రంలో వాతి కమింగ్ అనే లేటెస్ట్ ఫాస్ట్ బీట్‌కి ప్రగతి వేసిన డ్యాన్స్ వైరల్ అయ్యింది. ఇప్పుడు తాజాగా చేసిన ఈ మాస్ డాన్స్  వీడియో   సోషల్ మీడియాలో వైరల్‌గానూ మారింది.

ఇక ఎన్టీఆర్,శ్రీను వైట్లకాంబినేషన్ లో వచ్చిన బాద్‌షా సినిమాలో ఓ ఐటం సాంగ్‌‌కి సంబంధించిన చరణంపై సరదాగా స్టేప్పేయడం అప్పట్లో జనాలకు తెగ నచ్చేసింది. సీనియర్ ఎన్టీఆర్ నటించిన యమగోల సినిమాలోంచి గుడివాడ వెళ్లాను.. గుంటూరు పోయాను అనే పాటపై బాద్‌షా సినిమా కోసం ప్రగతి చేసిన డ్యాన్స్ చూశాకా... ఆమెలో ఈ యాంగిల్  కూడా ఉందా అని చర్చించుకున్నారు. కానీ బాద్‌షా చిత్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా ప్రగతిలో పాజిటివ్ వైబ్స్ ఇంకా ఏం తగ్గలేదని నిరూపించే ఈ  వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Stop trying to calm the storm.. calm urself storm will pass🤩💥💫💃 post workout nautanki🤪😜

A post shared by Pragathi Mahavadi (@pragstrong) on Jun 13, 2020 at 10:48am PDT