రాజకీయాలను టార్గెట్ చేస్తూ పూనమ్ ట్వీట్

హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కి అడుగుపెట్టిన పూనమ్ .. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఆమె నటించిన సినిమాలు హిట్ కాకపోవడంతో హీరోయిన్ గా ఉన్నతస్థాయిలోకి ఎదగలేకపోయింది. అయితే.. ట్విట్టర్ వేదికగా అప్పుడప్పుడు వివాదాస్పద ట్వీట్లు చేస్తూ.. వార్తల్లోకి ఎక్కుతుంటుంది. ముఖ్యంగా సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ ని టార్గెట్ చేస్తూ ఆమె ట్వీట్లు చేస్తుంటారు. తాజాగా.. పూనమ్ మరోసారి ట్వీట్ చేసింది. 

‘దేవుడి మీద ఒట్టు.. మీరు ఆలోచిస్తున్న వ్యక్తి గురించి కాదు. ఓ వ్యక్తి తనను తాను కాపాడుకునేందుకు న్యూస్ ఛానెళ్లలో ఒకరి గురించి మంచిగా మాట్లాడటం ప్రారంభించాడు. మీ దేవుడిపై దాడికి ప్రధాన కారణమైన అతడు ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు. నేనెప్పుడూ రంగులు మార్చలే’దంటూ పూనమ్ ట్వీట్ చేసింది. 

Scroll to load tweet…

తను ఎవరిని టార్గెట్ చేసిందో స్పష్టంగా తెలియకుండా పూనమ్ ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్‌ చూసి పవన్ ఫ్యాన్స్ మాత్రం ఫైర్ అవుతున్నారు. కాగా.. అసలు పూనమ్ ట్వీట్ కి అర్థం ఏమిటో మాత్రం ఎవరికీ అర్థం కాకపోవడం గమనార్హం.