Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య సర్ ని చూసి నేర్చుకోండి, ఈ ఏజ్ లో కూడా వరుస హిట్లు.. బాలీవుడ్ హీరోలపై ఊసరవెల్లి నటి కామెంట్స్

పాయల్ ఘోష్ ఇటీవల కొంత కాలంగా బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా పాయల్ ఘోష్ ఊహించని విధంగా నందమూరి బాలకృష్ణపై ప్రశంసలు కురిపించింది.

Actress Payal ghosh crazy comments on nandamuri balakrishna dtr
Author
First Published Nov 5, 2023, 9:25 AM IST

నార్త్ బ్యూటీ పాయల్ ఘోష్ ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తోంది. తమన్నా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి నటించిన ఊసరవెల్లి చిత్రం 2011లో విడుదలయింది.  ఈ చిత్రంలో తమన్నా ఫ్రెండ్ పాత్రలో బోల్డ్ బ్యూటీ పాయల్ ఘోష్ నటించిన సంగతి తెలిసిందే. తెలుగులో పాయల్ ఘోష్ ఊసరవెల్లితో పాటు ప్రయాణం, మిస్టర్ రాస్కెల్ లాంటి చిత్రాల్లో నటించింది. సౌత్ చిత్రాలతోనే ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 

పాయల్ ఘోష్ ఇటీవల కొంత కాలంగా బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా పాయల్ ఘోష్ ఊహించని విధంగా నందమూరి బాలకృష్ణపై ప్రశంసలు కురిపించింది. బాలయ్యని పొగుడుతూ బాలీవుడ్ హీరోలకు చురలకు అంటిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

పాయల్ ఘోష్ బాలయ్యతో ఉన్న పిక్ ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ఈ వయసులో కూడా బాలయ్య సర్ వరుసగా సూపర్ హిట్స్ కొడుతున్నారు. బాలీవుడ్ హీరోలు ఆయన్ని చూసి చాలా నేర్చుకోవాలి అంటూ పోస్ట్ చేసింది. 

నందమూరి బాలకృష్ణ అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా హ్యాట్రిక్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. దీనితో బాలయ్య ఈ వయసులో కూడా వెనకడుగు వేయకుండా వరుసగా చిత్రాలు చేస్తున్నారు అని పాయల్ చెప్పకనే చెప్పింది. బాలీవుడ్ లో యంగ్ హీరోలు ఇంత ఎనెర్జీ తో సినిమాలు చేయలేకపోతున్నారు అనేదే పాయల్ ఘోష్ ఉద్దేశమా ? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 

గతంలో మీటూ ఉద్యమం సమయంలో పాయల్ ఘోస్ట్ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది ఈ బ్యూటీ. ఆమె వ్యాఖ్యలు అప్పట్లో ప్రకంపనలు సృష్టించాయి.ఇటీవల మరోసారి కాస్టింగ్ కౌచ్ వ్యాఖ్యలు చేసింది.  నేను దేవుడి దయవల్ల సౌత్ లో నటిగా లాంచ్ అయ్యాను. ఒక వేళ బాలీవుడ్ లో అయి ఉంటే నా బట్టలు విప్పేసి శరీరాన్ని వాడుకునే వారు. బాలీవుడ్ లో అమ్మాయిల క్రియేటివిటీ, ట్యాలెంట్ కంటే వారి శరీరాలనే వాడుకుంటారు. వారికి ఎక్కువగా అదే కావాలి అన్నట్లు ప్రవర్తిస్తారు అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios