బెంగాల్ లో పలు టీవీ సీరియళ్లలో నటించిన పాయల్ చక్రవర్తి ఇటీవలే కొన్ని సినిమాల్లో నటించడానికి కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు.

బెంగాల్ లో పలు టీవీ సీరియళ్లలో నటించిన పాయల్ చక్రవర్తి ఇటీవలే కొన్ని సినిమాల్లో నటించడానికి కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇటీవలే భర్తతో విడిపోయిన పాయల్ తన కొడకుతో కలిసి జీవిస్తోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అయితే పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి అనే ప్రాంతంలో ఓ హోటల్ గదిలో ఆమె మృతదేహం లభ్యమైంది. మంగళవారం ఆమె హోటల్ లో అద్దెకు దిగగా, బుధవారం సాయంత్రం మృతి చెందిందని తెలుస్తోంది. బుధవారం ఆమె హోటల్ నుండి గ్యాంగ్టక్ అనే ప్రాంతానికి బయలుదేరాల్సి ఉండగా ఈ ఘటన జరిగింది.

ఆమె ఉంటోన్న హోటల్ గదిని ఎన్ని సార్లు కొట్టినప్పటికీ ఆమె స్పందించకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆమె మరణంతో సహనటులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు ఆమె ఎలా చనిపోయిందనే విషయంపై వివరాలు తెలియాల్సివున్నాయి!