Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 7: యావర్‌తో డేటింగ్‌, ప్రశాంత్‌ని పెళ్లి చేసుకుంటా.. తేల్చేసిన నటి నయని పావని

టిక్‌ టాక్‌తో పాపులర్‌ అయి సినిమాలు చేస్తూ, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఉన్న నయని పావని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌ బాస్‌ 7 హౌజ్‌లోకి అడుగుపెట్టింది. 
 

actress nayani pavani hot comments on yawar and pallavi prashanth arj
Author
First Published Oct 8, 2023, 10:50 PM IST

వైల్డ్ కార్డ్ ద్వారా నటి నయని పావని చివరి కంటెస్టెంట్‌గా బిగ్‌ బాస్‌ తెలుగు 7 హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె జోష్‌ఫుల్‌ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది. ఇక వచ్చాక హౌజ్‌ లో ఉన్న కంటెస్టెంట్లపై తన అభిమానాన్ని చాటుకుంది. దమ్మున్న కంటెస్టెంట్లు, దుమ్ము కంటెస్టెంట్లు ఎవరో తెలిపింది. 

అందులో భాగంగా ఆమె యావర్‌, ప్రశాంత్‌ దమ్మున్న కంటెస్టెంట్లు అని తెలిపింది. బాగా ఆడుతున్నారని, యావర్‌ నిజాయితీగా ఉంటాడని తెలిపింది. అలాగే రైతు బిడ్డ సైతం గేమ్‌లో బాగా ఆడుతున్నాడని తెలిపింది. ఇక దుమ్ము కంటెస్టెంట్ల విషయానికి వస్తే అమర్‌ దీప్‌, తేజలు అని చెప్పింది. గేమ్స్ లో మిస్‌ అవుతున్నారని, ఫెయిర్‌గా లేరని, తేజ ఇంకా బాగా ఆడాలని తెలిపింది. 

ఈ సందర్భంగా నాగార్జున ఓ టెస్ట్ పెట్టాడు. తేజ, యావర్‌, ప్రశాంత్‌లలో ఎవరితో డేటింగ్‌కి, ఎవరితో ఫ్రెండ్‌షిప్‌, ఎవరిని పెళ్లి చేసుకుంటావని అడగ్గా.. తేజతో ఫ్రెండ్‌షిప్‌ చేస్తా అని, యావర్‌తో డేటింగ్‌ చేస్తా అని తెలిపింది. యావర్‌ హాట్‌గా ఉంటాడని, అందుకే డేట్‌ చేస్తానని వెల్లడించింది. ఇక రైతుబిడ్డ ప్రశాంత్‌ని పెళ్లి చేసుకుంటానని చెప్పడం విశేషం. అనంతరం ఆమె బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వెళ్లింది. 

నయని పావని టిక్‌ టాక్‌ ద్వారా పాపులర్‌ అయ్యింది. ఆమె అసలు పేరు సాయి పావని రాజ్‌. తెలంగాణ అమ్మాయి. దీంతోపాటు షార్ట్ ఫిల్మ్స్ తో బాగా పాపులర్‌ అయ్యింది. వాటిలో `సమయం లేదు మిత్రమా`, `ఎంత ఘాటు ప్రేమ`, `పెళ్లి చూపులు 2.0` వంటి షార్ట్ ఫిల్మ్స్ ఆమెకి మరింత పేరు తెచ్చాయి. దీనికితోడు సోషల్‌ మీడియాలో ఇన్‌ఫ్లూయెన్సర్‌గానూ రాణిస్తుంది. అలాగే డాన్స్ షో ఢీలోనూ పాల్గొంది. వీటితోపాటు `చిత్తం మహారాణి`, `సూర్యకాంతం` వంటి సినిమాల్లోనూ నటించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios