షాకింగ్ లుక్.. గుర్తు పట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్

90వ దశకంలో హీరోయిన్లు అంటే విజయశాంతి, మీనా, రమ్యకృష్ణ , రంభ, శ్రీదేవి లాంటి వారు తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వస్తారు. వీరితో పాటు సౌత్ లో రాణించిన మరో బోల్డ్ హీరోయిన్ కూడా ఉన్నారు. ఆమె ఎవరో కాదు నగ్మా. 90 దశకంలో నగ్మా ఒక వెలుగు వెలిగింది.

Actress nagma shocking look goes viral dtr

90వ దశకంలో హీరోయిన్లు అంటే విజయశాంతి, మీనా, రమ్యకృష్ణ , రంభ, శ్రీదేవి లాంటి వారు తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వస్తారు. వీరితో పాటు సౌత్ లో రాణించిన మరో బోల్డ్ హీరోయిన్ కూడా ఉన్నారు. ఆమె ఎవరో కాదు నగ్మా. 90 దశకంలో నగ్మా ఒక వెలుగు వెలిగింది. వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఇలా స్టార్ హీరోలతో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. 

చిరంజీవితో ఘరానా మొగుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంలో నటించింది. అయితే నగ్మా ప్రస్తుతం కంప్లీట్ గా సినిమాలకు దూరమైంది. ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తోంది. నగ్మా మీడియాకి కనిపించడం కూడా చాలా తక్కువే. ఇటీవల నగ్మా మీడియా కంట పడింది. 

నగ్మా ఈ లుక్ లో చూస్తే ఫ్యాన్స్ సైతం గుర్తు పట్టడం కష్టం. బాగా చబ్బీగా మారిపోయింది. బొద్దుగా మారి విపరీతమైన బరువుతో కనిపిస్తోంది.  ప్రస్తుతం నగ్మా వయసు 48 ఏళ్ళు. నగ్మా రాజకీయాల్లో సైతం ఉంది. అయితే ఇటీవల ఇంటర్వ్యూలో నగ్మా తనకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉన్నట్లు తెలిపింది. కానీ ఆమె ఆ ప్రయత్నాల్లోనే ఉన్నట్లు కనిపించడం లేదు. 

 

అప్పట్లో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో నగ్మా కొంతకాలం ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు నగ్మా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటోంది. నగ్మా 1991లో నాగార్జున కిల్లర్ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె వెనుదిరి చూసుకోలేదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios