సినీ నటి ముమైత్ ఖాన్‌ తన క్యాబ్ లో తిరిగి ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టిందని ఓ క్యాబ్ డ్రైవర్ ఆరోపించాడు. తన క్యాబ్‌లో గోవా టూర్‌ వెళ్లొచ్చిన ముమైత్‌ రూ.15 వేల వరకు బాకీ పడిందని రాజు అనే క్యాబ్‌ డ్రైవర్‌ మీడియాకు తెలిపాడు. ఆ మొత్తం తిరిగి చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

 పూర్తి వివరాల్లోకెళితే.. మూడు రోజులు గోవాకు వెళ్లాలని ముమైత్ మొదట కారు బుక్ చేసుకున్నది. ఆ తర్వాత మూడు రోజులను కాస్త ఎనిమిది రోజుల పాటు పొడిగించింది. టోల్ గేట్‌కు, డ్రైవర్ అకామిడేషన్‌కు డబ్బులు కూడా ఇవ్వలేదు.

మొత్తం రూ.15 వేల వరకు ముమైత్ ఇవ్వాలని మీడియా, సోషల్ మీడియాలో రాజు ఆవేదన తెలియజేశాడు. మరో డ్రైవర్‌కు తనలాగా జరగకూడదని రాజు వాపోయాడు. ఈ ఘటనపై క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్‌తో కలిసి.. చర్చించిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రాజు చెబుతున్నాడు.

పోకిరి చిత్రంలో ఇప్పటికింకా నా వయస్సు పదహారే అంటూ రెచ్చి పోయి..ఆ తర్వాత తనే ప్రధాన పాత్రలో సినిమాలు చేసే దాకా ఎదిగింది. ఆ తర్వాత బిగ్ బాస్ తొలి సీజన్‌తో తెలుగు ఆడియెన్స్‌ని పలకరించిన సినీ నటి,  ముమైత్ ఖాన్ అంతగా మీడియా ముందుకు రాలేదు. సినిమా అవకాశాలు కూడా అంతకుముందు ఉన్నంత స్థాయిలో లేకపోవడంతో  ముమైత్ ఖాన్ పేరు ఇటీవల కాలంలో అంతగా వార్తల్లో లేదు.