సీనియర్ నటి ఖుష్బూ సుందర్ (Khushbu Sundar) ఇంట్లో విషాదం నెలకొంది. తన సొంతం అన్నయ్య ఈరోజు మృతి చెందాడు. దీంతో విషాద ఘటనను తెలియజేస్తూ భావోద్వేగభరితమైన పోస్టు పెట్టింది. 

సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ (Khushbu Sundar) తెలుగు, తమిళం ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన విషయం తెలిసిందే. టాలీవుడ్ లోని ప్రస్తుత సీనియర్ హీరోలతో నటించి ఆడియెన్స్ కు ఎంతో దగ్గరైంది. తాజాగా సమాచారం ప్రకారం.. ఖుష్బూ ఇంట్లో విషాదం నెలకొంది. ఖుష్బూ సోదరుడు ఈరోజు కన్నుమూశాడు. కొద్ది సేపటి కింద ఖుష్బూనే ఈ విషాద వార్తను వెల్లడించింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

నటి ఖుష్బూ సుందర్ 29 సెప్టెంబర్ 1970న ముంబై నగరంలోని అంధేరిలో జన్మించారు. ఆమె పుట్టిన పేరు నఖత్ ఖాన్. ఆమె తల్లిపేరు నజ్మా ఖాన్. ఖుష్బూకు ముగ్గురు అన్నయ్యలు కూడా ఉన్నారు. అబ్దుల్లా, అబూ బాకర్, అలీ వారి పేర్లు. వీరిలో పెద్దవాడైన అబ్దుల్లా ఖాన్ ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఈయన కూడా నటుడిగా కొన్ని చిత్రాల్లో నటించారు. అయితే కొద్దిరోజులు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో వారం కింద ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వెంటలేటర్ పై చికిత్స అందించారు. 

రెండ్రోజులు ఆరోగ్యం నిలకడగానే ఉండి.. చివరికి విషమించి చనిపోయారు. ఈ విషయాన్ని ఖుష్బూ సోషల్ మీడియా వేదికన తెలియజేస్తూ భావోద్వేగమైన నోట్ పెట్టింది. ‘ఈరోజుతో అన్నయ్య ప్రయాణం ముగిసింది. ఆయనతో ఎప్పటికీ సంతోషంగా ఉండాలని కోరుకున్నప్పటికీ.. వీడ్కోలు చెప్పే సమయం వచ్చింది. ఆయన ప్రేమ మరియు మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నయ్య చెప్పినట్లు, జీవిత ప్రయాణాన్ని దేవుడు నిర్ణయిస్తాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అంటూ ఎమోషనల్ నోట్ పంచుకుంది. 

Scroll to load tweet…