రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని పోస్టర్స్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకి కళ్యాణి నిర్మాతగా కూడా వ్యవహరించనున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా రూపొందుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ సినిమా. ఇంకా సినిమాకి టైటిల్ ని ఖరారు చేయలేదు.
సినిమా పరిశ్రమలో కళ్యాణి చేసింది తక్కువ సినిమాలే కానీ తన అందం, అభినయంతో గుర్తిండిపోయింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో, మంచి పాత్రల్లో నటిస్తూ, ప్రాధాన్యత గల పాత్రలతో ఆడియన్స్ లో పేరు తెచ్చుకుంది. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి, పెద్దయ్యాక హీరోయిన్ గా సౌత్ లో అన్ని భాషల్లో నటించింది.
రాజశేఖర్ సరసన శేషు మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. డైరెక్టర్ సూర్య కిరణ్ ని పెళ్లి చేసికుంది. ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు మూవీలో నటించిన కల్యాణి ఉత్తమ నంది అవార్డు అందుకుంది. జగపతి బాబు, వెంకటేష్ లతో ఎన్నో సినిమాల్లో చేసింది. ముఖ్యంగా జగపతి బాబుతో పలు సినిమాల్లో చేసి, బెస్ట్ ఫెయిర్ గా గుర్తింపు పొందారు. పెళ్లయ్యాక క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. లక్ష్యం సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. తమిళంలో కావేరిగా పాపులర్ అయింది. అందుకే కళ్యాణి కావేరిగా మార్చుకుంది.
ఆ తర్వాత గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ ఆడియన్స్ లో మంచి గుర్తింపు పొందిన కళ్యాణి తల్లిగా, వదినగా కూడా నటించింది. అయితే మళ్ళీ సినిమాలకు దూరమై ఇప్పుడు డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. చేతన్ శ్రీను అనే హీరోని పరిచయం చేయబోతోంది. గతంలో కొన్ని సినిమాలకి నిర్మాతగా కూడా వ్యవహరించారు. తాజాగా మెగాఫోన్ పట్టబోతున్నారు కళ్యాణి.
రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని పోస్టర్స్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకి కళ్యాణి నిర్మాతగా కూడా వ్యవహరించనున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా రూపొందుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ సినిమా. ఇంకా సినిమాకి టైటిల్ ని ఖరారు చేయలేదు.
ఇప్పటికే హీరో భారత స్వాతంత్య్ర్యం కోసం పోరాడిన వ్యక్తుల గెటప్స్ తో వేసిన లుక్స్ రిలీజ్ చేసిన ఈ సినిమా టీం తాజాగా వ్యాలెంటైన్స్ డే సందర్భంగా మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో హీరో చేతన్ చీను నగ్నంగా కూర్చున్న ఫోటోని రిలీజ్ చేశారు. ప్రేమ, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాల తో కూడిన సినిమాగా తెరకెక్కబోతుంది సమాచారం. టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా త్వరలో షూటింగ్ ముగించుకొని ఈ సంవత్సరమే విడుదల కానుంది.
