ప్రస్తుతం టాలీవుడ్‌ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. లాక్‌ డౌన్‌ను కూడా లెక్క చేయకుండా యంగ్ హీరో నిఖిల్‌, స్టార్ ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజులు పెళ్లి చేసుకోగా దగ్గుబాటి వారసుడు రానా కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కేందురు రెడీ అవుతున్నాడు. మరో యంగ్ హీరో నితిన్‌ కూడా త్వరలోనే పెళ్లి పనులు తిరిగి ప్రారంభిస్తున్నాడు. తాజాగా మరో టాప్‌ స్టార్‌కూడా పెళ్లి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.

టాలీవుడ్‌ చందమామ, స్టార్ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్ కూడా పెళ్లికి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం  ఈ బ్యూటీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఇండియన్‌ 2 తో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాల్లోనూ నటిస్తోంది. ఈ సినిమాల తరువాత మరో ప్రాజెక్ట్‌ ను ఇంత వరకు ఓకే చేయలేదు. దీంతో ఈ సినిమాను పూర్తి చేసిన వెంటనే కాజల్‌ పెళ్లి చేసుకుంటుందన్న టాక్‌ వినిపిస్తోంది.

 ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గత ఏడాది కాలంగా తల్లి దండ్రులు తనను పెళ్లి విషయంలో ఒత్తిడి చేస్తున్నారని తెలిపింది కాజల్‌. దీంతో మరోసారి కాజల్‌ పెళ్లి వార్తలు తెర మీదకు వచ్చాయి. లాక్‌ డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటున్న తల్లి దండ్రులు సెలెక్ట్ చేసిన అబ్బాయితో పెళ్లికి ఓకే చెప్పిందన్న టాక్‌ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలపై కాజల్‌ మాత్రం ఇంతర వరకు స్పందిచలేదు. నో అని కూడా చెప్పకపోవటంతో పెళ్లి వార్తలు నిజమే అయ్యుంటాయని భావిస్తున్నారు ఫ్యాన్స్‌. అసలు విషయం తెలియాలంటే మాత్రం అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్‌ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.