టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసిన నటి జ్యోతి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. తన బోల్డ్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించినప్పటికీ ఎక్కువగా కాలం ఇండస్ట్రీలో కంటిన్యూ చేయలేకపోయింది.

బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొని మరోసారి ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. తాజాగా ఆమె ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని హాట్ కామెంట్స్ చేసింది.

తనకు పవన్ కళ్యాణ్ తో నటించాలని ఎప్పటినుండో ఉందని చెప్పిన ఈమె ప్రస్తుతం పవన్ పొలిటికల్ బిజీ అయిపోయారని.. ఇప్పటి హీరోల్లో విజయ్ దేవరకొండతో నటించాలని ఉందని చెప్పింది.  అంతేకాదు..విజయ్ దేవరకొండ షర్ట్ లేకుండా తనతో నటించాలని ఉందంటూ తన మనసులో కోరికను బయటపెట్టింది.

మొన్నటివరకు నాని అంటే ఇష్టం ఉండేదని, విజయ్ వచ్చిన తరువాత అతడిపై ఇష్టం ఏర్పడిందని చెప్పుకొచ్చింది. మరి హీరోయిన్లలో ఎవరంటే ఇష్టమని అడిగితే.. ''ఇప్పుడు ఎవరున్నారు..? నాకు ఎవరూ గుర్తు రావడం లేదు'' అనేసింది.